Ph.D.: పీహెచ్‌డీ ప్రవేశాల్లో అక్రమాలు అవాస్తవం
Sakshi Education
హైదరాబాద్ లోని జేఎన్‌టీయూహెచ్‌లో పీహెచ్‌డీ ప్రవేశాల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని విశ్వవిద్యాలయం డైరెక్టర్ (అడ్మిషన్స్) సీహెచ్ వెంకట్రామిరెడ్డి స్పష్టంచేశారు.
కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ల విషయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ కచి్చతంగా పాటించామని, ఈ వివరాలన్నీ వెబ్‌సైట్‌లోనూ పొందుపరిచినట్లు పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సీట్లను ఓసీ అభ్యర్థులతో భర్తీ చేశారంటూ కొంతమంది చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తేల్చి చెప్పారు.
చదవండి:
JNTUH: పీహెచ్‌డీకి నోటిఫికేషన్ విడుదల..అర్హతలు ఇవే..
JNTU Hyderabad: ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
Published date : 18 Nov 2021 05:22PM