Skip to main content

JNTUH: పీహెచ్‌డీకి నోటిఫికేషన్‌ విడుదల..అర్హ‌త‌లు ఇవే..

కేపీహెచ్‌బీకాలనీ(హైదరాబాద్‌): జేఎన్‌టీయూహెచ్‌ ఫుల్‌టైమ్‌ పీహెచ్‌డీ వెబ్‌ నోటిఫికేషన్‌ను అక్టోబ‌ర్ 20వ తేదీన‌ విడుదల చేశారు.

అఖిల భారత సాంకేతిక విద్యామండలి డాక్టోరియల్‌ ఫెలోషిప్‌ స్కీమ్‌లో భాగంగా అన్ని ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించడంతో పాటు గత ఐదేళ్ల కాలంలో నెట్, గేట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన వారు అక్టోబ‌ర్‌ 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నిర్దేశిత ఫీజు, ధ్రువీకరణ పత్రాలు అడ్మిషన్‌ విభాగానికి పంపాలని అడ్మిషన్స్‌ విభాగం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు.

Published date : 21 Oct 2021 12:36PM

Photo Stories