Prasanna Kumar: ఈ కోర్సులో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టిఫికెట్ కోర్సు శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ మార్చి 10న ఓ ప్రకటనలో తెలిపారు.
ఇంటర్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లో తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేయాలని సూచించారు. విజయవాడలోని పీఎన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, కడపలోని రాయలసీమ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, గుం టూరులోని వావిలాల సంస్థను శిక్షణా కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు. ఏప్రిల్ 1 నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులను శిక్షణ కేంద్రాల ప్రిన్సిపాల్స్‌కు అందజేయాలని సూచించారు.
చదవండి:
ఘనమైన కెరీర్...లైబ్రరీ కోర్సులు !
గ్రామాలకు త్వరలో వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలు.. ఈ సదుపాయాలతోనే..
Published date : 11 Mar 2022 01:41PM