Skip to main content

ఘనమైన కెరీర్...లైబ్రరీ కోర్సులు !

అధ్యయనానికి అమ్మ వంటిది.. లైబ్రరీ. కాలేజీ.. లైబ్రరీ రెండింటినీ విడదీయలేం. అయితే ఇప్పుడు లైబ్రరీలు సైతం కొత్త రూపును సంతరించుకుంటున్నాయి.
ఇందులో భాగమే సమాచార నిర్వహణ, అన్వేషణలు డిజిటల్ పద్ధతిలోకి మారడం. లైబ్రరీ ప్రాధాన్యం, నిర్వహణలో వచ్చిన ఆధునిక మార్పుల కారణంగా ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. దీంతోలైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులకు ఉజ్వల అవకాశాలు అందుబాటులో ఉంటున్నాయి.

కోర్సులు..
ప్రస్తుతం దేశంలో చాలా వరకు యూనివర్సిటీలు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సును అందిస్తున్నాయి. సర్టిఫికెట్ కోర్స్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, డిప్లొమా ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (బీఎల్‌ఐఎస్‌సీ), మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (ఎంఎల్‌ఐఎస్‌సీ) తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్మీడియెట్ / బ్యాచిలర్ డిగ్రీ/బీఎల్‌ఐఎస్‌సీ అర్హతతో ఈ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. ఉన్నతవిద్య దిశగా వెళ్లాలనుకుంటే ఎంఫిల్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, పీహెచ్‌డీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని వర్సిటీలు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఆయా వర్సిటీలు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష లేదా ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డా. బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తదితర విద్యాసంస్థలు దూరవిద్యా విధానంలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్‌‌స కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) కూడా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులు అందిస్తోంది.
  • లైబ్రరీ ప్రొఫెషనల్స్‌కు ఆధునిక నైపుణ్యాలు అందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంలో న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ (NISCAIR), ఇండియన్ నేషనల్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ సెంటర్ (INSDOC) వంటివి ముందు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్‌ఐఎస్‌సీఏఐఆర్.. లైబ్రరీ ఆటోమేషన్‌కు సంబంధించి నాలుగు వారాల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది. వెబ్‌సైట్: www.niscair.res.in

కోర్సు స్వరూపం..
అన్ని కోర్సుల మాదిరిగానే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సులోనూ మార్పులు వచ్చాయి. గతంలో పుస్తకాలు, జర్నల్స్ నిర్వహణకే పరిమితమైన శిక్షణ.. ప్రస్తుతం సీడీలు, డీవీడీలు, మైక్రోఫిల్మ్స్ సేకరణ, శాస్త్రీయ పద్ధతుల్లో సమాచార సంరక్షణ తదితర అంశాల వరకు వెళ్లింది. ప్రధానంగా కోర్సులో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్, క్లాసిఫికేషన్, క్యాటలాగింగ్ సిస్టమ్స్, డాక్యుమెంటేషన్, మెయింటెనెన్స్, లైబ్రరీ మేనేజ్‌మెంట్, రీసెర్చ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్, ఇండెక్సింగ్, లైబ్రరీ ప్లానింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు.
ఉపాధి వేదికలు..
  • స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు.
  • ప్రభుత్వ గ్రంథాలయ సంస్థలు.
  • బ్యాంకుల శిక్ష ణా కేంద్రాలు.
  • మ్యూజియంలు.
  • ఎన్జీవోలు.
  • కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) తదితర ప్రతిష్టాత్మక పరిశోధన, అభివృద్ధి సంస్థలు.
  • విదేశీ రాయబార కార్యాలయాలు, హైకమిషన్లు.
  • యూఎన్‌వో, డబ్ల్యూహెచ్‌వో, యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు.
  • గ్రంథాలయ నెట్‌వర్క్‌లు.
  • మీడియా హౌస్‌లు.
  • డిజిటల్ లైబ్రరీస్ ఆఫ్ ఇండియా..
జాబ్ ప్రొఫైల్స్ :
  • లైబ్రేరియన్
  • లైబ్రరీ అసిస్టెంట్
  • ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
  • లైబ్రరీ అటెండెంట్
  • డిప్యూటీ లైబ్రేరియన్
  • ఇన్ఫర్మేషన్ అనలిస్టు
వేతనాలు..
వివిధ సంస్థల్లో లైబ్రేరియన్లుగా చేరిన వారికి ప్రారంభంలోనే రూ.20 వేల వేతనం లభిస్తుంది. డీఆర్‌డీవో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వంటి పరిశోధన సంస్థల్లో చేరితే సైంటిఫిక్ సిబ్బందికి సమాన స్థాయిలో జీతాలు అందుకోవచ్చు.
Published date : 07 May 2018 06:13PM

Photo Stories