Skip to main content

లైబ్రరీ ఆఫ్ సైన్సెస్ జ‌ర్నల్‌లో కేఎంసీ పరిశోధన పత్రం

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 గురించి దేశంలోని ఇతర ఆరు వైద్యసంస్థలతో కలిసి కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ) బృందం రూపొందించిన పరిశోధనాపత్రం అమెరికాలోని పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్సెస్ జర్నల్లో ప్రచురితమైంది.
Edu news
కేఎంసీలోని వైరల్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ల్యాబొరేటరి వైద్యులు డాక్టర్‌ పి.రోజారాణి, డాక్టర్‌ జె.విజయలక్ష్మి, డాక్టర్‌ ఎ.సురేఖలు దేశంలోని కోవిడ్‌-19 బాధితుల నుంచి శ్యాంపిల్స్‌ సేకరించి అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ద్వారా మొదటిసారిగా భారతదేశంలో 73 నోవెల్‌ కరోనా వేరియంట్స్‌ను కనుగొన్నారు.

సీఎస్‌ఐఆర్‌/ఐజీఐబీ, ఏసీఎస్‌ఐఆర్‌లతోపాటు భువనేశ్వర్, రాజస్థాన్, ఢిల్లీ, నోయిడాలలో ఉన్న ప్రముఖ వైద్య సంస్థలతో కలిసి కేఎంసీ ఈ పరిశోధనాపత్రాన్ని రూపొందించింది. పరిశోధనలో పాల్గొన్న ఏడు వైద్యసంస్థల్లో దక్షిణ భారతం నుంచి కేఎంసీ మాత్రమే ఉంది.

ఆర్టీసీకి ఐటీ అవార్డు...
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)కి జాతీయ స్థాయి ఐటీ అవార్డు వచ్చింది. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ విభాగంలో ఈ అవార్డు వచ్చినట్టు ఆర్టీసీ చీఫ్‌ ఇంజనీర్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. యాప్‌ ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ వంటి వాటిని ప్రవేశపెట్టినందుకుగాను ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఆర్‌.పి.ఠాకూర్‌ ఉన్నారు.
Published date : 24 Feb 2021 06:19PM

Photo Stories