INSPIRE Awards Manak: ఇన్‌స్పైర్ అవార్డ్స్ మానక్‌కు దరఖాస్తుల ఆహ్వానం
జగిత్యాల: నూతన ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మండలి సంయుక్తంగా ఏటా ఇన్‌స్పైర్ అవార్డ్స్ మానక్ నిర్వహిస్తున్నాయని డీఈవో జగన్మోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో శాసీ్త్రయ నైపుణ్యం పెంపొందించేందుకు ఇది వేదికగా నిలుస్తుందన్నారు. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. భౌతిక, జీవ, గణితశాస్త్ర ఉపాధ్యాయుల సహకారంతో https://www.inspireawards-dst.gov.in/ లో ఆగస్టు 31లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో ఐడియా బాక్స్ ఏర్పాటు చేసి, వచ్చిన మంచి ఆలోచనల్లో ఐదింటిని ఎంపిక చేసి, గైడ్ ఉపాధ్యాయులు నామినేషన్లు వేయాలన్నారు. ఎంపికై న ప్రాజెక్టులకు రూ.10 వేల చొప్పున విద్యార్థుల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో ఉత్తమంగా రాణిస్తే రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించే అవకాశం దక్కుతుందని తెలిపారు.
చదవండి: Department of Education: నైపుణ్యాలపై విద్యార్థులకు శిక్షణ