Inter hall tickets: బోర్డు వెబ్‌సైట్‌లో ఇంటర్ హాల్ టికెట్లు
- విద్యార్థులు నేరుగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
- ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ విద్యార్థుల థియరీ పరీక్షల హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో ఉంచామని విద్యార్థులు స్వయంగా లేదా ఏదైనా నెట్ సెంటర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు తెలిపారు. మొదటి సంవత్సరం విద్యార్థులు వారి ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్ కానీ, ఎస్సెస్సీ హాల్ టికెట్ నంబర్ కానీ, లేదా ఆధార్ నంబర్ కానీ ఉపయోగించి ప్రస్తుత థియరీ పరీక్షల హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులు వారి రెండవ లేదా మొదటి సంవత్సరం హాల్ టికెట్ నంబర్ కానీ, ఆధార్ నంబర్ కానీ ఉపయోగించి థియరీ పరీక్షల హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని వివరించారు. హాల్ టికెట్లలో విద్యార్థుల ఫొటోలు, సంతకాల్లో సవరణ అవసరమైనప్పుడు మాత్రమే విద్యార్థులు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌ను సంప్రదించి సరి చేసుకోవాలని శేషగిరిబాబు సూచించారు.
Also read: Government Jobs: పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో 38926 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..