Skip to main content

Government Jobs: పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో 38926 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్‌ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
india post recruitment 2022
india post recruitment 2022

మొత్తం పోస్టుల సంఖ్య: 38926

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: 
తెలంగాణ: 1226. 
ఆంధ్రప్రదేశ్‌: 1716.

పోస్టుల వివరాలు ఇలా..: బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(ఏబీపీఎం), డాక్‌ సేవక్‌. 

అర్హతలు: 
పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. 

వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 

జీతభత్యాలు ఇలా..:
☛ టైం రిలేటెడ్‌ కంటిన్యూటీ అలవెన్స్‌ (టీఆర్‌సీఏ) ప్రకారం జీతభత్యాలు చెల్లించాలి. 
☛ బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు. 
☛ ఏబీపీఎం/డాక్‌సేవక్‌ పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.10000 చెల్లిస్తారు. 

ఎంపిక విధానం ఇలా..:
☛ పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్‌ జనరేటెడ్‌ మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది. 

☛ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
☛ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022
☛ దరఖాస్తులకు చివరి తేది: 05.06.2022
పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:  https://indiapostgdsonline.gov.in/

ఇత‌ర ప్ర‌భుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి​​​​​​​

Published date : 02 May 2022 08:24PM

Photo Stories