Minority Welfare Department: మైనారిటీ కాలేజీ తనిఖీ
Sakshi Education
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి శ్రీనివాసరావు జూలై 27న తనిఖీ చేశారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ముఖ్యంగా దోమ కాటు నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. చుట్టుపక్కల ఎలాంటి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమ తెరలు వాడాలని చెప్పారు.
చదవండి: ప్రతి నెలా మైనార్టీ గురుకులాల తనిఖీ.!
బియ్యం, సరుకులు, కూరగాయల నాణ్యతను పరిశీలించారు. అనంతరం కిచెన్ రూమ్, డైనింగ్ హాల్‌ను పరిశీలించి వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మహమ్మద్ ఇమాముద్దీన్, డిప్యూటీ వార్డెన్ షేక్ సాధీర్, స్టాఫ్ నర్స్ యాకయ్య, డ్యూటీ లెక్చరర్ శ్రీనివాస్ ఉన్నారు.
చదవండి: Minority Welfare Department: ఉర్దూలో స్టడీ మెటీరియల్
Published date : 28 Jul 2023 04:20PM