Skip to main content

ప్రతి నెలా మైనార్టీ గురుకులాల తనిఖీ.!

సాక్షి, హైదరాబాద్‌: మైనార్టీ గురుకుల విద్యా సంస్థల నిర్వహణపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు.
Inspection of Minority Gurukuls every month
ప్రతి నెలా మైనార్టీ గురుకులాల తనిఖీ.!

జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, మైనార్టీ కార్పొరేషన్‌ అధికారుల ఆధ్వర్యంలో ప్రతి నెలా మైనార్టీ విద్యా సంస్థను తనిఖీ చేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పరిశీలన నిర్వహించి అక్కడి పరిస్థితులపై రాష్ట్ర కార్యాలయానికి నివేదించాలని ఆదేశించారు. ఈ నివేదికల ఆధారంగా ప్రతి మూడు నెలలకో సారి రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు.

చదవండి: TS Gurukul Jobs 2022: గురుకుల విద్యాసంస్థలో12 వేల ఉద్యోగాలు!!

డిసెంబర్‌ 28న హజ్‌ హౌస్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారులు, మైనార్టీ కార్పొరేషన్‌ అధికారులతో మంత్రి కొప్పుల భేటీ నిర్వహించారు. జిల్లాల్లో నిర్మిస్తున్న షాదీఖానాలకు సంబంధించి పురోగతి అంతంతమాత్రంగానే ఉందన్నారు. 2023 మార్చి నెలాఖరుకల్లా నూరు శాతం పనులు పూర్తి చేయా లని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో వేగం పెరగ కుంటే సంబంధించి జిల్లా అధికారులను బాధ్యు లను చేస్తానని ఆయన హెచ్చరించారు. భేటీలో మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్‌ నదీమ్, హజ్‌ బోర్డు చైర్మన్‌ సలీం, ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ముజీబుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: Admissions: ఈ విద్యా సంస్థల్లో సీట్లు ఖాళీ లేవంటూ బోర్డులు

Published date : 29 Dec 2022 01:55PM

Photo Stories