Faculty: గౌరవ వేతనం పెంపు
Sakshi Education
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ గౌరవ వేతనం పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జే శ్యామలరావు అక్టోబర్ 20న ఉత్తర్వులు (జీవో 157) జారీ చేశారు.
వారి వేతనాన్ని గంటకు రూ.200 నుంచి రూ. 400కు ప్రభుత్వం పెంచింది. ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో కొంతమేరకైనా ఉపశమనం కలిగించేలా వీరి వేతనాలు పెంచడం హర్షణీయమని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. నెలకు రూ.28 వేలకు మించకుండా వీరికి గౌరవ వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.
చదవండి:
JNTUH: ‘బయోమెట్రిక్’ లేకపోతే ఫ్యాకల్టీగా పరిగణించం..
Published date : 21 Oct 2022 04:45PM