IBC: ఐబీసీ హ్యాకథాన్ ప్రారంభం
మాదాపూర్‌లోని టీ హబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ఈ పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు, పరిశ్రమ వర్గాలతో పాటు సంబంధిత వర్గాలు అందరికీ ఉపకరించే కార్యక్రమం ఈ హ్యాక్ ఫెస్ట్ అని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ప్రొఫెషల్స్, విద్యార్థుల కోసం దీనిని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
చదవండి: Mahankali Srinivas Rao: ఇక స్టార్ట్..‘అప్’!.. 30 కాలేజీలతో అనుసంధానం..
దేశంలోని మూడు నగరాలలో జరిగే హ్యాక్ ఫెస్ట్ సిరీస్‌లో తొలిగా హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నామని, దీనిలో అత్యధికంగా కోటి రూపాయల వరకూ బహుమతి అందిస్తామన్నారు.ఈ ఎనిమిది రోజుల హ్యాక్‌థాన్‌లో భాగంగా శిక్షణ, మేధోమధనం, స్పీడ్ బిల్డింగ్ సెషన్స్, డెమోడే వంటివి ఉంటాయన్నారు. అదే విధంగా ఇంటర్నేషనల్ బ్లాక్ చైన్ కాంగ్రెస్ ఐబీసీ 2.0 కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, టీ–హబ్ సీఈఓ శ్రీనివాసరావు మహంకాళి, ఐబీసీ మీడియా ఫౌండర్–సీఈఓ శ్రీ అభిషెక్ పిట్టీ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Women's startup: తెలంగాణ మహిళా వ్యవస్థాపకులకు జాతీయస్థాయి గుర్తింపు