Skip to main content

Women's startup: తెలంగాణ మహిళా వ్యవస్థాపకులకు జాతీయస్థాయి గుర్తింపు

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఐదుగురు మహిళా స్టార్టప్‌ వ్యవస్థాపకు లకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. నీతి ఆయోగ్‌లోని అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌ నవంబర్ 4న 75 మంది విజయవంతమైన మహిళా వ్యవస్థాపకుల (స్టార్టప్స్‌) వివరాలతో ‘ఇన్నొవేషన్‌ ఫర్‌ యు’ అనే కాఫీటేబుల్‌ బుక్‌ను విడు దలచేసింది.
National recognition for Telangana women entrepreneurs
National recognition for Telangana women entrepreneurs

అంత్యేష్టి ఫ్యునరల్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వ్యవస్థాపకు రాలు శ్రుతిరెడ్డి రాపోలు, ఆటోక్రసీ మెషినరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు సంతోషి బుద్ధిరాజు, గరుడాస్ట్ర ఏరో ఇన్వెంటివ్‌ సొల్యూషన్స్‌ వ్యవస్థాపకురాలు CEO శ్వేత గెల్లా, నేచర్స్‌ బయో ప్లాస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు ప్రతిభా భారతి, నియో ఇన్వెట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు CEO శ్రీవల్లి శిరీష తమ తమ నూతన ఆవిష్కరణలతో కాఫీటేబుల్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ పుస్తకాన్ని జాతి భవిష్యత్తు నాయకులుగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న మహిళలందరికీ అంకితం ఇస్తున్నామని ఆవిష్కర్త, అటల్‌ ఇన్నొవేషన్‌ మిషన్‌ డైరెక్టర్‌ చింతన్‌ వైష్ణవ్‌ తెలిపారు. 

Also read: CRPF: ఇద్దరు సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు తొలిసారిగా ఐజీ ర్యాంక్‌కు ప్రమోట్‌ అయ్యారు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 05 Nov 2022 01:28PM

Photo Stories