ఐటీఐ కాలేజీలకు హెచ్‌పీ లేజర్ ప్రింటర్లు
Sakshi Education
నాంది ఫౌండేషన్, ఎల్రక్టానిక్ ఉత్పత్తుల సంస్థ హెచ్.పి. సహకారంతో రాష్ట్రంలోని 31 ప్రభుత్వ ఐటీఐ కాలేజీలకు హెచ్.పి. లేజర్ ప్రింటర్లను అందించినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్‌ఎస్‌డీసీ) ఎండీ ఎన్.బంగార్రాజు తెలిపారు.
కార్పొరేట్ సంస్థలు సామాజిక సేవలో భాగంగా ఈ రెండు సంస్థలు కలిసి ప్రభుత్వ ఐటీఐలకు ప్రింటర్లను అందించినట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఐటీఐల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఎపీఎస్‌ఎస్‌డీసీ ఇప్పటికే 11 డిజిటల్ ల్యాబులు ఏర్పాటు చేసిందని, ప్రముఖ సంస్థలైన హిటాచి, జాగ్వార్, ష్నైడర్, ఇండియన్ గ్రానైట్ ఇండస్ట్రీల స హకారంతో ఐటీఐ కాలేజీల్లో అత్యాధునిక ల్యాబులు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
చదవండి:
Published date : 02 Nov 2021 12:57PM