Skip to main content

DR YSR Horticultural University: హార్టీ సెట్‌ ఫలితాలు విడుదల.. టాపర్లు వీరే..

తాడేపల్లిగూడెం:పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలోని వెంకట్రామన్నగూడెంలో ఉన్న Dr. Y.S.R. Horticultural University అక్టోబర్‌ పదో తేదీన నిర్వహించిన హార్టీ సెట్‌–2022 ఫలితాలను నవంబర్‌ 17న వర్సిటీ వీసీ టాక్టర్‌ టి.జానకీరామ్‌ విడుదల చేశారు.
horti cet results released
హార్టీ సెట్‌ ఫలితాలు విడుదల చేస్తున్న ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్‌ తోలేటి జానకీరామ్, అధికారులు

బీఎస్సీ (ఆనర్స్‌) హార్టీకల్చర్‌ నాలుగు సంవత్సరాల కోర్సులో చేరడానికి ఈ పరీక్షను నిర్వహించారు. మొత్తం 382 మంది హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణులయ్యారు. నాలుగు ప్రభుత్వ, ఏడు ప్రైవేట్‌ ఉద్యాన కళాశాలలకు చెందిన విద్యార్థులు హార్టీ సెట్‌కు హాజరయ్యారు. ఉమ్మడి జీవన నరసింహ సత్య గణేష్‌ (ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాల, రామచంద్రాపురం) మొదటి ర్యాంక్‌ సాధించాడు.

చదవండి: ఉద్యాన వర్సిటీ వంగడాలకు ప్రభుత్వ గుర్తింపు.. ఆ వంగడాలు ఇవే..

పింజారీ షరీఫ్‌ (ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాల, కలికిరి) రెండో ర్యాంక్, మిద్దే ప్రణీత్‌కుమార్‌ (ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాల, రామచంద్రాపురం) మూడో ర్యాంక్‌ సాధించారు. ఫలితాలు డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వీసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ బి.శ్రీనివాసులు, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ డీవీ స్వామి, డీన్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ ఏఎస్‌ పద్మావతమ్మ, డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ నారం నాయుడు, డీన్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌ ఎస్‌.సూర్యకుమారి, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ ఎఫైర్స్‌ డీఆర్‌ సలోమి సునీత, డైరెక్టర్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ కె.ధనుంజయరావు పాల్గొన్నారు.

చదవండి: ICAR: ఉద్యాన వర్సిటీకి జాతీయ ర్యాంకు

Published date : 18 Nov 2022 02:32PM

Photo Stories