Health Kits: విద్యార్థినులకు ‘హెల్త్’ కిట్లు
8 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఈ అడాలసెంట్ హెల్త్ కిట్ల (శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు)ను ఉచితంగా పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించి వైద్య, ఆరోగ్య శాఖ నేడో, రేపో ఉత్తర్వులు జారీచేయనుంది. ఇందుకుగాను మొత్తం రూ.69.52 కోట్లతో హెల్త్ కిట్ల కొనుగోలు, పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న దాదాపు 11 లక్షల మంది విద్యార్థినులకు లబ్ధి చేకూరనుందని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆరు నెలల కోసం 11 లక్షల కిట్లు కొనుగోలు చేస్తారు. ఈ కిట్‌లో ఆరు శానిటరీ న్యాప్‌కిన్ ప్యాక్స్, వాటర్ బాటిల్, ఒక బ్యాగ్ ఉంటుంది. ఇక 2023–24 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రభుత్వం మొత్తం 22 లక్షల కిట్లు కొనుగోలు చేయనుంది. ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానిని అమలు చేస్తోంది.
చదవండి: Medical and Health Department: వైద్య నియామకాలకు స్పెషల్ మెడికల్ బోర్డు
ఆరోగ్యానికి దోహదం..
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం, 15–24 ఏళ్ల మధ్య వయసున్న యువతుల్లో సుమారు 32% మంది న్యాప్‌కిన్ లాగా సాధారణ గుడ్డను వినియోగిస్తున్నారు. దీంతో గర్భాశయ, మూత్రకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్లు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. 14 నుంచి 19 సంవత్సరాల వయసున్న కౌమార బాలికలు రుతుక్రమం సమయంలో శుభ్ర త పాటించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. దీంతో వారు ఆరోగ్యవంతంగా ఉండేందుకు, తద్వారా చదువుపై మరింత శ్రద్ధ చూపించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. అలాగే విద్యారి్థనుల హాజరు శాతం కూడా పెరిగేందుకు తోడ్పడుతుందని వైద్య వర్గాలు తెలిపాయి.
చదవండి: Artificial Intelligence: నిమిషాల్లో వ్యాధి నిర్ధారణకు సరికొత్త ఏఐ సాధనం
త్వరలో టెండర్లు!
కాగా, టెండర్లు పిలిచి త్వరలో హెల్త్ కిట్లను పంపిణీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కిట్ పేరుతో బాలింతలకు కిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. తర్వాత న్యూట్రిషన్ కిట్లు కూడా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు విద్యారి్థనులకు హెల్త్ కిట్లు ఇస్తోంది.
చదవండి: World Mental Health Day: ప్రతిరోజు ఇన్ని గంటలు నిద్రపోవాలి