Artificial Intelligence: నిమిషాల్లో వ్యాధి నిర్ధారణకు సరికొత్త ఏఐ సాధనం
Sakshi Education
గుండె జబ్బులు, అల్జీమర్స్ వంటి రుగ్మతలకు సంబంధించిన పరీక్ష ఫలితాలను నిమిషాల్లోనే అందించే సాధనాన్ని బ్రిటన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
ఇది కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేస్తుంది. ఇది ఆరోగ్య పరిరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. స్వాన్ సీ వర్సిటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. మెషీన్ లెర్నింగ్ అనే ఒక రకం ఏఐని ఉపయోగించడం వల్ల ఇది సాధ్యమైంది. శరీరంలోని సైనోవియల్ ఫ్లూయిడ్, బ్లడ్ ప్లాస్మా, లాలాజలంలో కొన్ని రకాల ప్రొటీన్లు ఉంటాయి. పలు ఆరోగ్య సమస్యలకు ఇవి సూచికలుగా పనిచేస్తాయి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 04 Nov 2022 06:10PM