Skip to main content

MANUU: వృత్తి విద్యాకోర్సులకు ప్రభుత్వ ఆమోదం

రాయదుర్గం: గ చ్చిబౌలిలోని మౌలానా ఆజాద్‌ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్వహించే వృత్తి విద్యా కోర్సులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం ఉందని ఉర్దూ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ సయ్యద్‌ ఐనుల్‌హసన్‌ తెలిపారు.
Government approval for MANUU vocational courses
సమావేశంలో పాల్గొన్న వీసీ సయ్యద్‌ ఐనుల్‌హసన్, మెడికోవర్‌ ఆస్పత్రి వైద్యబృందం

వర్సిటీ ఆరోగ్య కేంద్రంలో ఏప్రిల్‌ 5న నిర్వహించిన సమావేశంలో ఫిజియోథెరపిస్టులు, స్కిల్‌ స్పెషలిస్టులు, కార్డియాలజిస్టులకు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ కోర్సులు (బి.ఓక్‌) చివరి సెమిస్టర్‌ పూర్తైన విద్యార్థులకు మెడికోవర్‌ ఆసుపత్రిలో పని చేసేందుకు అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను అందజేశారు. ఈ సందర్భంగా వీసీ ఐనుల్‌హసన్‌ మాట్లాడుతూ, బ్యాచిలర్‌ స్థాయిలో పారామెడికల్‌ వృత్తి విద్యాకోర్సులను ప్రారంభించడంలో ముందున్న మొదటి విశ్వవిద్యాలయం ‘మనూ’అని అన్నారు.

చదవండి: ‘మనూ’లో సీయూఈటీ ద్వారా యూజీ ప్రవేశాలు

ఒకేషనల్‌ మొదటి బ్యాచ్‌లోని 50 మంది విద్యార్థులలో 16 మంది విద్యార్థులకు వారి చివరి పరీక్షకు ముందే రేడియాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ విభాగంలో మెడికోవర్‌ ఆస్పత్రి ఎంపిక చేసిందన్నారు. ఈ బ్యాచ్‌ తన ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను ఇటీవలే ముగించిదన్నారు. ఉర్దూ విశ్వవిద్యాలయంలో మాస్టర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ కోర్సులు, ఇతర కోర్సులను కూడా ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మెడికోవర్‌ ఆస్పత్రి కార్డియాలజిస్ట్, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శరత్‌రెడ్డి, ఉర్దూ విశ్వవిద్యాలయం రిజి్రస్టార్‌ ప్రొఫెసర్‌ ఇష్తియాక్‌ అహ్మద్‌ మెడికోవర్‌ ఆస్పత్రి గ్రూప్‌ మెడికల్, అకడమిక్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సతీష్‌కుమార్‌ కైలాసం, స్కూల్‌ ఆఫ్‌ సైన్సెస్‌ ఇన్‌చార్జ్‌ డీన్‌ సయ్యద్‌ నజూ్మల్‌ హసన్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Admissions: ‘మనూ’లో పార్ట్‌టైమ్‌ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు

Published date : 06 Apr 2023 12:54PM

Photo Stories