Skip to main content

Government of Telangana : విద్యార్థులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. ఈ ఏడాది నుంచి ఇవ‌న్నీ ఉచితం.. ఇంకా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం జూన్ 12వ తేదీన‌ స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు శుభ‌వార్త చెప్పింది.
CM KCR
TS School Students

నోట్ బుక్స్ ఇంకా స్కూల్ వెళ్లడానికి కావాల్సిన వస్తువుల కొనుగోలును విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పేరెంట్స్‌కు భారం తగ్గించడానికి కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు, తల్లిదండ్రులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ అకాడమిక్ నుంచి ఫ్రీగా నోట్ బుక్స్ అందించాలని నిర్ణయించింది.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ 

వీరికి మాత్ర‌మే..

ts school text books

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, మోడల్ స్కూల్స్, గురుకులం స్కూల్స్‌ , అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్‌లలో చదివే విద్యార్థులందరికీ ఈ నోట్ బుక్స్ ను అందించనుంది. అయితే ఈ ఏడాది 6 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు మాత్రమే ఈ నోట్ బుక్స్‌ను పంపిణీ చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-5 తరగతుల విద్యార్థులకు కూడా నోట్‌బుక్స్‌, వర్క్‌ బుక్స్‌ ను ఉచితంగా అందించేందుకు నిర్ణయించినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.

చదవండి: Jagananna Vidya Kanuka: తల్లితండ్రులపై భారం పడకుండా

పుస్త‌కాల పంపిణీ ఇలా..

kcr with students

ఈ కార్యక్రమం అమలుకు దాదాపు రూ.56.24 కోట్లు ఖర్చు అవుతోందని సర్కార్ అంచనా వేస్తోంది. మొత్తం 1,17,88,699 నోట్‌ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. 6,7వ తరగతి విద్యార్థులకు 6 చోప్పున 200 పేజీల నోట్‌ బుక్స్ ఉంటుంది. 8వ తరగతి విద్యార్థులకు 7 నోట్‌బుక్స్‌ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే 9, 10వ తరగతి విద్యార్థులకు 14 నోట్‌బుక్స్‌, ఇంటర్ విద్యార్థులకు 12 నోట్‌బుక్స్ అందించనున్నారు.

చదవండి: School Education Department: బడికి రప్పించేలా రవాణా చార్జీలు

ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంతో రాష్ట్రంలోని 12,39,415 మంది విద్యార్థులు లబ్ధి చేకూరనుంది. ఇంకా ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్‌ను ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం రూ.150 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

Published date : 03 Jun 2023 02:12PM

Photo Stories