Skip to main content

ఆ పోస్టుల్లో విద్యార్థులకు అవకాశం కల్పించండి

‘ఆయుష్మాన్‌ భారత్‌ – హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌’ సెంటర్లలో మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులకు యునాని, నేచురోపతి, హోమియోపతి అభ్యర్థులకు సైతం అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కోరారు.
Give opportunity to students in those posts
ఆ పోస్టుల్లో విద్యార్థులకు అవకాశం కల్పించండి

ఈ మేరకు సెప్టెంబర్‌ 27న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయకు హరీశ్‌రావు లేఖ రాశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బీఎస్సీ కమ్యూనిటీ హెల్త్‌ లేదా బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎంతో పాటు ఇగ్నో/మెడికల్‌ వర్సిటీ నుంచి ప్రత్యేక కోర్సు చేసిన ఆయుర్వేద డాక్టర్లు మాత్రమే ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు అర్హులుగా ఉన్నారని, దీనివల్ల మిగతా అభ్యర్థులకు నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టమ్స్‌ ఆఫ్‌ మెడిసిన్, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ హోమియోపతి ప్రకారం బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎన్‌వైఎస్, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సులు మెడిసిన్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులేనని, వాటి కాలవ్యవధి, అర్హత కూడా సమానమేనని స్పష్టంగా ఉన్నదని లేఖలో గుర్తు చేశారు. 

చదవండి: 

PG Admissions : పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుద‌ల‌. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

Andhra Pradesh: వైద్య విధాన పరిషత్‌లో పలు కేడర్లలో మార్పులు

TS: మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీఎంఈల వయోపరిమితి 65 ఏళ్లకు పెంపు

Published date : 28 Sep 2022 03:54PM

Photo Stories