Skip to main content

PG Admissions : పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుద‌ల‌. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : మెడికల్, డెంటల్‌ కళాశాలల్లో 2022–23 విద్యా సంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ సీట్లలో ప్రవేశాలకు ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం ఆగ‌స్టు 12వ తేదీన (శుక్రవారం) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Admissions
Dr NTR health university Admissions

పీజీ మెడికల్‌ ప్రవేశాల కోసం https://pgcq.ntruhsadmissions.com లో, ఎండీఎస్‌ ప్రవేశాల కోసం  https://mds.ntruhsadmissions.com/ లో  ఆన్‌లైన్‌ అప్లికేషన్లు అందుబాటులో ఉంచింది. ఆగ‌స్టు 13వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆగ‌స్టు 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్‌ నం. 150 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ కోటాలోని 50 శాతం సీట్లలో 30 శాతం క్లినికల్, 50 శాతం నాన్‌ క్లినికల్‌ సీట్లను ప్రత్యేకంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలు అందించిన ఇన్‌–సర్వీస్‌ అభ్యర్థులకు కేటాయించారు. దరఖాస్తు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 నంబర్లలో సంప్రదించాలని రిజిస్ట్రార్‌ డాక్టర్‌ సీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. సమాచారంకోసం 8978780501, 7997710168, 9391805238 నంబర్లలో సంప్రదించాలన్నారు.

పీజీ వైద్య విద్య ఇన్‌సర్వీస్‌ కోటా నిబంధనల్లో..
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్లలో ఇన్‌–సర్వీస్‌ కోటా నిబంధనల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. గిరిజన ప్రాంతాల్లోని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వం గుర్తించిన సంస్థల్లో రెండేళ్లు పనిచేసిన వైద్యులకు ఇన్‌సర్వీస్‌ కోటా కింద ప్రవేశాలకు అవకాశం కల్పించింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో మూడేళ్లు, ఏపీ వైద్య, ఆరోగ్య సేవలు, ఏపీవీవీపీ, ఏపీ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్, యూనివర్సిటీల్లో నిరంతరాయంగా ఆరు సంవత్సరాలు సేవలందించిన వారికి ఇన్‌సర్వీస్‌ కోటాకు అర్హత కల్పించారు. స్పెషలైజేషన్‌ పూర్తయిన తర్వాత ఇన్‌సర్వీస్‌ కోటా కోసం పని చేసినట్టు చూపిన ప్రాంతంలోనే ఆరేళ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది.

Published date : 26 Sep 2022 11:39AM

Photo Stories