Frontline Warriors: ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా వీరే: కేంద్రం
Sakshi Education
అంగన్ వాడీ టీచర్లు, ఆయాలను కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తిస్తూ కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖలమంత్రి సత్యవతి రాథోడ్ హర్షం వ్యక్తంచేశారు.
వారికి రూ.50 లక్షల బీమా సౌకర్యం కూడా కలి్పంచారని, ఇందుకు రాష్ట్రప్రభుత్వం చేసిన కృషే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఈమేరకు కేంద్రప్రభుత్వానికి, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి స్మృతీ ఇరానీకి సత్యవతి కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ తర్వాత కేంద్రప్రభుత్వం వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిని ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి, రూ.50 లక్షల బీమా సదుపాయం కల్పించిందని, కానీ కోవిడ్ సమయంలో విశేష సేవలందించిన అంగన్ వాడీలకు మాత్రం ఈ బీమా సదుపా యం కలి్పంచలేదని తెలిపారు. దీంతో వారికి కూ డా ఈ సదుపాయం కల్పించాలని తాము 2021, జూన్ 23న కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు.
చదవండి:
Published date : 07 Oct 2021 03:40PM