Skip to main content

THE: ‘టైమ్స్‌’ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ఇంజనీరింగ్‌ కళాశాల..

లండన్ కు చెందిన టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్ సంస్థ 2022 సంవత్సరానికిగానూ సబ్జెక్టుల వారీగా ర్యాంకులు ప్రకటించింది.
THE
‘టైమ్స్‌’ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ఇంజనీరింగ్‌ కళాశాల..

ర్యాంకుల్లో ఇంజనీరింగ్‌ సబ్జెక్టులో ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏఎన్ యూ ఇంజనీరింగ్‌ కళాశాల రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకును, జాతీయ స్థాయిలో 10వ ర్యాంకును, అంతర్జాతీయ స్థాయిలో 601–800వ కేటగిరీలో ర్యాంకు సాధించింది. అక్టోబర్‌ 6న యూనివర్సిటీలో వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ కళాశాల అధికారులు, సిబ్బంది, పరిశోధకుల కృషితోనే ఈ ర్యాంకు సాధ్యమైందన్నారు. రెక్టార్‌ ఆచార్య పి వరప్రసాదమూర్తి, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఈ శ్రీనివాసరెడ్డి, ఏఎన్ యూ ఆన్ లైన్ ర్యాంకింగ్స్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ బీహెచ్‌ కిషోర్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ బి. కరుణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: 

టాప్‌లో ప్రకాశం.. మొత్తం ర్యాంకుల్లో శ్రీకాకుళం

ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో ప్రభుత్వ విద్యార్థుల హవా

Published date : 07 Oct 2021 01:52PM

Photo Stories