Agri Robot Project: పెరుమాళి విద్యార్థులకు నాలుగో స్థానం
మార్చి 2 జిల్లాస్థాయిలో జరిగిన ఈఎండీపీలో మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన అగ్రి–రోబోట్ ప్రాజెక్ట్ జిల్లాస్థాయిలో టాప్–4లో నిలిచింది. ఈ మేరకు మార్చి 4న ప్రిన్సిపాల్, ప్రాజెక్ట్ ట్రైనర్ అధ్యాపకుడు, ఇతర అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులకు అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
చదవండి: Vyommitra: అంతరిక్షంలోకి మహిళా రోబో ‘వ్యోమమిత్ర’
కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన ఈఎండీపీ ప్రాజెక్ట్ ప్రదర్శనకు జిల్లా నుంచి 256 ప్రాజెక్ట్‌స్ ప్రదర్శనకు వచ్చాయన్నారు. వాటిలో తమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు జి.దేవిశ్రీ ప్రసాద్, వి.కార్తీక్‌లు అగ్రిరోబోట్ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించించి టాప్–4లో నిలవడం ఆనందంగా ఉందన్నారు.
తమ పాఠశాల విద్యార్థులు తయారు చేసి ప్రదర్శించిన అగ్రి రోబోట్ ప్రాజెక్ట్ త్వరలో జరగనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రదర్శనలో టాప్–1లో నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారిని ట్రైన్ చేసిన అధ్యాపకుడు టి.లక్ష్మణ్‌ను ఆమె అభినందించారు.