Skip to main content

Harshanth Sairam: ‘పీజీ సూపర్‌స్పెషాలిటీ’లో ఖమ్మంవాసికి ఫస్ట్‌ ర్యాంక్‌

First rank in PG Super Specialty
First rank in PG Super Specialty

ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్‌ చావా హర్షంత్‌ సాయిరామ్‌ తెలంగాణకు జాతీయ స్థాయిలో ఘనత తెచి్చపెట్టాడు. అఖిల భారత స్థాయిల్లో మెడికల్‌ పీజీ సూపర్‌ స్పెషాలిటీ ప్రవేశపరీక్షలో కార్డియోథొరాసిక్‌ అండ్‌ వ్యాసు్కలర్‌ సర్జరీ విభాగంలో తొలి ర్యాంకు సాధించాడు. ఢిల్లీ ఎయిమ్స్‌ ఆధ్వర్యం లో ఈ నెల 7న నిర్వహించిన ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌ (ఐఎస్‌ఐఎస్‌)’ పరీక్షలో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన విద్యార్థులకు ఢిల్లీ ఎయిమ్స్, పీజీఐ చండీగఢ్, జిప్‌మర్‌ పాండిచ్చేరి తదితర వైద్య సంస్థల్లో సూపర్‌ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. 


Click here for more Education News
 

 

Published date : 27 Dec 2021 01:45PM

Photo Stories