Rajasthani Bazaar: విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల కోసం ఎగ్జిబిషన్
Sakshi Education
సాక్షి, చైన్నె: రాజస్తానీ అసోసియేషన్ నేతృత్వంలో రాజస్థానీ బజార్ పేరిట సంస్కృతి, ఐక్యను చాటే విధంగా ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.
సెయింట్ జార్జ్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ సినీ నటి , కలైమామణి సుకన్య రమేష్, నటి నీలిమా రాణి, రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఎండీ జగదీశ్ ప్రారంభించారు. ఇక్కడ 150 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. విభిన్న కళాత్మకాలను కొలువు దీర్చారు.
చదవండి: Scholarships: విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం తోడ్పాటు
ఈ వేడుక ద్వారా వచ్చే మొత్తంలో రూ. 50 లక్షలను విద్యార్థులకు స్కాలర్ షిప్‌లకు ఉపయోగిస్తున్నామని నవంబర్ 6న జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్ ఎక్స్ పో చైర్మన్ నరేంద్ర శ్రీమల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నిర్వాహకులు దిలీప్ చందన్, మోహన్ లాల్ బజాజ్, ప్రవీణ్ తాటియా, హేమంత్ దుగర్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 07 Nov 2023 03:15PM