Skip to main content

Free Training: ఉచిత శిక్షణకు రేపు ప్రవేశ పరీక్ష

నల్లగొండ: వివిధ పోటీ పరీక్షల ప్రిపరేషన్‌ కోసం ఐదు నెలల ఉచిత ఫౌండేషన్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 10న ఉదయం 11నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఉంటుందని జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Entrance test tomorrow for free training    free foundation training for competitive exams

ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఇవ్వనున్న ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకున్నవారు స్టడీ సర్కిల్‌ వెబ్‌సైట్‌ tsstudycircle.co.in ద్వారా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్ను మాత్రమే తెచ్చుకోవాలని సూచించారు.

చదవండి: Free Training: ఉచితంగా ప‌లు విభాగాల్లో శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో గల శ్రీచైతన్య హై స్కూల్‌లో పరీక్ష ఉంటుందని, 11 గంటలలోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలకు సెల్‌ : 8465035932, 9603167257 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
 

Published date : 09 Mar 2024 04:47PM

Photo Stories