Election Lessons & Activities: సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాల్లో.. ఎన్నికల పాఠం
అందుకే విద్యార్థి దశ నుం చే సాంఘిక శాస్త్రంలో 'భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ' పాఠం ముద్రితమైంది. ఇది ప్రజాస్వా మ్యం, ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది. ఎన్నికల వ్యవస్థ నుంచి ఓటు హక్కు వినియోగం వరకు విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేలా పాఠ్యాంశం రూపొందించారు.
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల అవసరాన్ని గుర్తించి 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం 1952లో తొలి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించగా, ఆ ఎన్ని కల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారు. ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 92 కోట్లకు చేరింది.
చదవండి: Right to Vote: తొలిసారి ఓటు హక్కు వినియోగం... యువతకు ఒక బాధ్యత, ఒక అవకాశం
6వ తరగతి నుంచి..
విద్యార్థి దశ నుంచే ఓటు హక్కు విలువ, ఎన్నికల విశిష్టతను తెలియజేసేందుకు విద్యార్థులకు పాఠ్యాంశాలను సాంఘికశాస్త్రంలో పర్చారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠశాల దశలోనే విద్యార్థులకు పరిచయం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు ఇలా పలు అంశాలను విద్యార్థులకు పరిచయం చేశారు.
- 6వ తరగతిలో ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రత్యక్ష, పరోక్ష ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు, శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖలు, అధిక ఓటర్లు తీసు కునే నిర్ణయం, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించే ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిని ఎన్నుకునే విధానం, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపా తంగా నిర్వహించే విధానం, నమూనా ఎన్నికల నిర్వహణ గురించి వివరించారు. మెజారిటీ పాలన, ఆర్టికల్ 326, విశ్వజనీన వయోజన ఓటు హక్కు గురించి వివరించారు.
- 7వ తరగతిలో సార్వజనీన వయోజన ఓటు హక్కు, ప్రజాస్వామ్యం, గణతంత్రం, రాజ్యాంగ రూపకల్పనా చరిత్ర, ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతాయుతమైన పౌరసత్వం, దేశభక్తి, స్వీయ క్రమశిక్షణ, శాసనసభ్యుని ఎన్నిక, రహస్య ఓటింగ్ విధానం తదితర భావనలను విద్యార్థులకు పరిచయం చేశారు.
- 8వ తరగతిలో మనకు పార్లమెంట్ ఎందుకు అవసరం? పార్లమెంట్ ఎలా ఏర్పడుతుంది? రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు ఎలా ప్రవేశ పెట్టారు? ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వినియో గం, 2004 సాధారణ ఎన్నికల నుంచి వినియోగిం చిన విధానం, ఈవీఎంల వినియోగించడం వల్ల 1,50,000 చెట్లను రక్షించుకోగలగడం, బ్యాలెట్ పత్రాల ముద్రణకు అవసరమయ్యే 8వేల టన్నుల కాగితం ఉపయోగపడిన అంశం తదితర విషయా లను వివరించారు.
- 9వ తరగతిలో 'ఎన్నికల రాజకీయాలు' అనే చాప్టర్లో భారతదేశంలో ఎన్నికలను మదింపు చేయడం, వివిధ నియోజకవర్గాల మధ్య సరిహద్దు రేఖలను నిర్ణయించడం, ఎన్నికల ఫలితాలను ప్రక టించే వరకు ఎన్నికల్లో వివిధ దశలను వివరిం చారు. ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడడంలో ఎన్నికల సంఘం పాత్రను వివరించారు. భారతదేశంలో ఎన్నికల విధానం, రిజర్వ్ నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా, అభ్య ర్థులు నామినేషన్ వేసే విధానం, విద్యార్హతలు, పోలింగ్ జరిగే విధానం, ఓట్ల లెక్కింపు తదితర విషయాలను ప్రస్తావించారు. ఎన్నికల సంఘం స్వతంత్రత గురించి వివరిస్తూనే ఎన్నికలు ప్రకటన చేసినప్పటి నుంచి ఫలితాలు ప్రకటించే వరకు ఎన్నికల సంఘం నిర్వహించే ప్రతి అంశాన్ని పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. ఎన్నికల సంఘం విధులకు సంబంధించి చక్కటి ఫొటోలతో, విద్యా ర్థులను ఆకట్టుకునే విధంగా పాఠ్యాంశాల రూప కల్పన చేపట్టారు.
ఎన్నికల సంఘం పనితీరు
విద్యార్థి దశ నుంచే విద్యార్థు లకు రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం, అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో ఎన్నికల విధానం గురించి సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాల్లో చక్కగా వివరించారు. ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కల్పించేం దుకు ఇవి దోహదం చేస్తాయి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పవిత్రతను విద్యార్థులకు తెలియజే స్తాయి. ఫలితంగా విద్యార్థులు దేశ భవిష్యత్తును నిర్మించగలుగుతారు.
- కేఎస్వీ కృష్ణారెడ్డి, సాంఘిక శాస్త్ర పుస్తక రచయిత, హెచ్ఎం, జెడ్పీహెచ్ఎస్, ఈతకోట, రావులపాలెం మండలం
బ్యాలెట్ నుంచి ఈవీఎం వరకు
భారత ఎన్నికల సంఘం, పనితీరు తెలుసుకునే అవకాశం విద్యార్థులకు ఉంది. ఆరు నుంచి పదవ తరగతి వరకు వివిధ అంశాలను పాఠ్యాంశాల్లో పొందుపర్చారు. బ్యాలెట్ నుంచి ఈవీఎంల వరకు ఎన్నికల సంఘంలో వచ్చిన ఆధునిక మార్పులను విద్యార్థులకు వివరించారు. ప్రజాస్వా మ్యంలో ఓటు విలువను విద్యార్థులు తెలుసుకుంటున్నారు.
- గరగ సీతాదేవి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు, జెడ్పీహెచ్ఎస్, రాయవరం