Schools & Colleges Holiday 2023 : రాఖీ పండుగ.. స్కూల్స్, కాలేజీల సెలవుపై క్లారిటీ ఇదే.. ఈ తేదీనే హాలీడే..
ఈ సారి రాఖీ పౌర్ణమి ఎప్పుడు ఉంటుందనే అంశంపై క్లారిటీ కొరవడింది. కొందరు ఆగస్టు 30వ తేదీ రాఖీ పౌర్ణమి అంటుంటే.. మరి కొందరు మాత్రం ఆగస్టు 31న రాఖీ అని చెబుతున్నారు.
దీంతో రాఖీ పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలో తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. రాఖీ పౌర్ణమి సెలవును ఏమైనా మారుస్తారా.. అనే సందేహం విద్యార్థుల్లో కూడా వ్యక్తమవుతోంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమి రోజునే అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారి ఆశీస్సులు తీసుకుంటారు.
సోదర సోదరీమణుల అనుబంధానికి గుర్తుగా ఈ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. ఈ సంవత్సరం రక్షాబంధన్ రెండు రోజులపాటు జరుపుకోనున్నారు. ఇది ఆగస్టు 30న ప్రారంభమై..ఆగస్టు 31 వరకు ఉంటుంది. ప్రభుత్వాలు మాత్రం రాఖీ పౌర్ణమికి సంబంధించి ఆగస్టు 31న ఆప్షనల్ హాలీడేను గతంలో ప్రకటించాయి.
సెలవు విషయంపై ఎలాంటి సందేహం అవసరం లేదని..
ఆగస్టు 30న పౌర్ణమి పూర్తి స్థాయిలో ఉండడం లేదని ప్రముఖ అర్చకులు చెబుతున్నారు. రాహుకాలం ఉండడంతో ఆ రోజున మహిళలు వారి సోదరులకు రాఖీలు కట్టడం అంత మంచిది కాదంటున్నారు. దీంతో ఆగస్టు 31న రాఖీ జరుపుకోవాలని చెబుతున్నారు. రాఖీ పౌర్ణమి సెలవు సైతం ఆగస్టు 31వ తేదీ నాడే ఉంటుంది. దీంతో సెలవు విషయంపై ఎలాంటి సందేహం అవసరం లేదని అధికారుల నుంచి వస్తున్న సమాచారం.
సెప్టెంబర్ నెలలో సెలవుల పూర్తి వివరాలు ఇవే..
☛ సెప్టెంబర్ 3- ఆదివారం
☛ సెప్టెంబర్ 7- శ్రీకృష్ణ జన్మాష్టమి
☛ సెప్టెంబర్ 9- రెండో శనివారం
☛ సెప్టెంబర్ 10- ఆదివారం
☛ సెప్టెంబర్ 17- ఆదివారం
☛ సెప్టెంబర్ 18- వినాయక చవితి
☛ సెప్టెంబర్ 23- నాలుగో శనివారం
☛ సెప్టెంబర్ 24- ఆదివారం
☛ సెప్టెంబర్ 28- మిలాద్ ఉన్ నబీ
Tags
- August 31 Schools Holidays
- august 31st colleges holidays
- raksha bandhan schools holidays 2023
- raksha bandhan telugu news
- colleges holidays raksha bandhan 2023
- Schools Closed on These dates for Raksha Bandhan
- Colleges Closed on These dates for Raksha Bandhan
- Raksha Bandhan 2023
- Due to Schools Holiday Raksha Bandhan 2023
- Raksha Bandhan
- Raksha Bandhan Holidays
- Raksha Bandhan Holiday Date
- Raksha Bandhan Holiday
- Raksha Bandhan Holiday Details Telugu
- Schools and Colleges Closed on These dates for Raksha Bandhan
- sakshi edication