Skip to main content

Raksha Bandhan 2023: విద్యాసంస్థల్లో రక్షాబంధన్‌ వేడుకలు

సిరికొండ/మోపాల్‌(నిజామాబాద్‌రూరల్‌)/నిజామాబాద్‌ సిటీ/నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లోని పలు ప్రయివేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో బుధవారం రక్షాబంధన్‌ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా విద్యార్థులు ఒకరినొకరు రాఖీలు కట్టించుకొని, శుభాకాంక్షలు తెలిపారు.
రక్షాబంధన్‌ వేడుకలు
రక్షాబంధన్‌ వేడుకలు

అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులకు పండుగ విశిష్టతను వివరించారు. అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెల్లు ఒకరినొకరు రక్షగా ఉండేందుకు రక్షాబంధన్‌ నిర్వహిస్తారన్నారు. అలాగే బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రబంధకులు బ్రహ్మకుమారీలు నగరంలోని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులకు రాఖీలు కట్టారు. 

Amma Vodi: AP Model School Student Sucharitha English Speech In Kurupam Meeting #sakshieducation

 

Published date : 31 Aug 2023 05:03PM

Photo Stories