Skip to main content

ఎంవోయూలతో బోధన, పరిశోధన రంగాల్లో ముందడుగు

వివిధ వర్సిటీలు, సంస్థలతో ఒప్పందాల వల్ల బోధన, పరిశోధనా రంగాల్లో ముందడుగు వేయవచ్చని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు అన్నారు.
Dr V Praveen Rao said that teaching and research will be developed with MoUs
ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ వి.ప్రవీణ్‌రావు

విద్యార్థులు, శాస్త్రవేత్తలు, అధ్యాపకుల పరస్పర మార్పిడికి అవకాశముంటుందని, జాయింట్‌ డిగ్రీ కోర్సులు ప్రారంభించడానికి కూడా ఇవి ఉపకరిస్తాయని తెలిపారు. వర్సిటీ జూలై 19న పలు వర్సిటీలు, సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దక్షిణ ఆస్ట్రేలియాలో 50 ఏళ్ల క్రితం ఏర్పాటైన ముర్దోక్‌ విశ్వవిద్యాలయంతో కలిసి పని చేసేందుకు ఆ వర్సిటీ ఇంటర్నేషనల్‌ ఛైర్‌ రాజీవ్‌ వర్షిణి, పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.సుధీర్‌ కుమార్‌లు వీసీ ప్రవీణ్‌రావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. సికింద్రాబాద్‌కి చెందిన కావేరి సీడ్స్‌ కంపెనీ లిమిటెడ్, చర్లపల్లికి చెందిన అగ్రి బయో సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలతోనూ ఎంవోయూ కుదర్చుకుంది.

చదవండి: 

Published date : 20 Jul 2022 04:39PM

Photo Stories