Skip to main content

District science officer: 31లోగా ఇన్‌స్పైర్‌ నామినేషన్స్‌ పూర్తి చేయాలి

Inspire nominations

కెరమెరి(ఆసిఫాబాద్‌): ఈ నెల 31లోగా ఇన్‌స్పైర్‌ నామినేషన్లు పూర్తిచేయాలని జిల్లా సైన్స్‌ అధికారి కటకం మధుకర్‌ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉపాధ్యాయులకు నిర్వహించిన ఓరియెంటేషన్‌ కార్యక్రమంలో మాట్లాడారు. 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌ వరంలాంటిదన్నారు. ప్రతీ పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థులను నామినేట్‌ చేయాలన్నారు. ఉత్తమంగా నిలిచిన ప్రాజెక్టుకు రూ.10వేల కేటాయిస్తారని తెలిపారు. కార్యక్రమంలో మండల నోడల్‌ అధికారి ప్రకాశ్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

Published date : 25 Jul 2023 03:35PM

Photo Stories