Collector Encouragement for Students : విద్యార్థులకు కలెక్టర్ ప్రోత్సాహం.. ప్రత్యేక కార్యక్రమానికి నాంది ఇలా..!!

సాక్షి ఎడ్యుకేషన్: టెన్త్ విద్యార్థులకు బోర్డు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ప్రతీ విద్యార్థిపై దృష్టి సారించి వారు ఉన్నత మార్కులు సాధించే దిశగా సన్నాహాలు చేయాలని ఇప్పటికే పాఠశాల యాజమాన్యాలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ సారించాలని, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు తన వంతు ప్రయత్నంగా.. విద్యార్థుల ఇంటి తలుపులు తట్టి వారిని ప్రోత్సహించే కార్యక్రమం చేపట్టారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు.
Private School Tution Fees : సీపీఐ ఆధారంగా ఫీజు పెంపుకు అనుమతి.. ఈ నిబంధనలను పాటించాలి..
ఈ ప్రక్రియలో భాగంగా, ఓ టెన్త్ క్లాస్ విద్యార్థి ఇంటికి వెళ్ళారు కలెక్టర్. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం శేరిగూడెం గ్రామంలో గురువారం ఈ కార్యక్రమానికి నాంది పలుకుతూ.. నారాయణపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ టెన్త్ విద్యార్థి ఇంటి తలుపు కొట్టారు. ఎవరా..! అని తల్లి ఆలోచిస్తూ తలుపు తీసింది. తీరా చూస్తే.. వచ్చింది జిల్లా కలెక్టర్. కలెక్టరే స్వయంగా వచ్చారా..!! అనుకుంటూ ఉండగా తన కొడుకు భరత్ గురించి అడిగారు. తన కొడుకు కోసం ఇంటివరకు వచ్చారా.. అని ఆశ్చర్యపోయారు. వెంటనే భరత్‌ను పిలవగా తను పదో తరగతి చదువుతున్నాడు కదా.. తనకు బోర్డు పరీక్షల కోసం ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాము అంటూ వారి ప్రయత్నాన్ని చెప్పుకొచ్చారు.
పదో తరగతి మైలురాయి..
ఇప్పటి విద్యార్థులు చిన్నచిన్న విషయాలకే చాలా ఒత్తిడికి గురవుతున్నారు. అందులోనూ ఇది పదో తరగతి పరీక్షల సమయం. ఈ సమయంలో విద్యార్థులు మరింత చురుగ్గా ఉంటూ, ప్రతీ ప్రయత్నాన్ని వారి విజయం కోసం అనే అనుకొని ముందడుగు వేయాలి అని పేర్కొన్నారు. విద్యార్థికి పదో తరగతి ఓ మైలురాయి అని చెప్పుకొచ్చారు. ప్రతీ విద్యార్థి తమకంటూ ఓ సమయ పాలన పెట్టకొని అందుకు తగ్గట్టుగానే పరీక్షకు సిద్ధమవ్వాలని వివరించారు. ఎంత కష్టమైనా, ఇష్టంగా ప్రయత్నిస్తే ఏది అసాధ్యం కాదని ప్రోత్సాహించారు కలెక్టర్ హనుమంతరావు.
ప్రతీ నెల 5000
టెన్త్ విద్యార్థులు బోర్డు పరీక్షలకు చాలా శ్రద్ధగా సిద్ధమవ్వాలి. ఎలాంటి లోటు, ఒత్తిడి లేకుండా తమకు తాము ప్రోత్సాహికంగా నిలవాలి. భరత్‌కు తండ్రి లేరు. తన తల్లి తనను కష్టపడి చదివిస్తున్నారు. చిన్నతనం నుంచే భరత్‌కు పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది ఆశయం. తనను ఎలాగైనా చదివించి తన ఆశయాన్ని నెరవేర్చాలన్నాదే తన తల్లి తపన.
Tenth Class Exams 2025: పదో తరగతి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
అయితే, ఈ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్, నువ్వు మీ అమ్మ పడుతున్న కష్టానికి ఫలితం తీసుకురావాలి. కష్టపడి చదివి ఉన్నత మార్కులు సాధించి మీ అమ్మ గర్వపడేలా చేయాలి అంటూ ప్రోత్సాహించారు. అంతేకాకుండా, ప్రతీ నెల రూ. 5000 ఇస్తానని హామీ ఇస్తూ, ఈ నెల పేరున రూ. 5000 ఆ కుటుంబానికి అందజేశారు. అంతేకాదు, తన జీవితంలో స్థిరపడేవరకు వీలైనంత సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు కలెక్టర్.
ఆత్మవిశ్వాసం పెరిగింది..
తన ఇంటికి స్వయాన కలెక్టరే రావడంతో తల్లికొడుకులు ఎంతో ఆనందించారు. స్వయంగా తానే వచ్చి ప్రోత్సాహించడంతో తన ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందని, తాను మాట్లాడిన మాటలకు నాకు ఉన్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతానని తన తల్లి పడే కష్టానికి ప్రతిఫలం అందిస్తానని భరత్ వ్యక్తం చేశాడు.
అంతేకాదు, స్వయంగా కలెక్టరే తన ఇంటికి రావడంతో ఆ తల్లి కూడా ఎంతో ఆనందించింది. తన కొడుకుని, మిగితా విద్యార్థులను ఇలా ప్రోత్సాహించే కార్యక్రమం చేపట్టడం చాలా బాగుందన్నారు ఆ తల్లి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ts tenth 2025
- Tenth board exams
- students preparations
- district collector special program
- Tenth Students
- students education
- tenth students board exams preparations
- board exams preparation tips
- district collector hanumanth rao
- appreciation and encouragement for tenth students
- special program for students
- special program for tenth students
- telangana tenth board exams 2025
- exam preparation tips for tenth students
- tenth board exams 2025
- Education News
- Sakshi Education News
- ExamPreparationTips