Skip to main content

Private School Tution Fees : సీపీఐ ఆధారంగా ఫీజు పెంపుకు అనుమ‌తి.. ఈ నిబంధ‌న‌లను పాటించాలి..

రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్‌ ఫీజును సంవత్సరానికి ఒకసారి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా నిర్ణ‌యించుకొని పెంచుకోవచ్చు.
State Education Commission's recommendations on school fees  Education commission recommendations on fee regulation in private schools

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్‌ ఫీజును సంవత్సరానికి ఒకసారి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా నిర్ణ‌యించుకొని పెంచుకోవచ్చు. ఈ ప్ర‌క్రియ కోసం నియ‌మించే క‌మిష‌న్ మూడేళ్ల‌కోసారి ఫీజుల రుసుమును స‌మీక్షించి స‌వ‌రిస్తుంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర విద్యాక‌మిష‌న్ స‌ర్కార్‌కు ప‌లు సిఫార్సులు చేసింది. గత నెలలో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని సీనియర్‌ అధికారులు, ఇద్దరు డీఈవోలు, మరికొందరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్లు బుధవారం సమావేశమై చర్చించారు.

ముసాయిదాలో చేసిన సిఫార్సులు..

- ఫీజుల నియంత్రణకు రాష్ట్రస్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేసి, ఛైర్మన్‌గా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లేదా విశ్రాంత ఐఏఎస్‌ అధికారిని నియమించాలి. పాఠశాల విద్యాశాఖలో పనిచేసిన విశ్రాంత సంయుక్త సంచాలకుడు, ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌ సభ్యులుగా ఉండాలి.
జిల్లాల స్థాయిలో కలెక్టర్‌ ఛైర్మన్‌గా జిల్లా రుసుముల నియంత్రణ కమిటీ (డీఎఫ్‌ఆర్‌సీ)లు ఉంటాయి.

- ఈ క‌మిష‌న్ జిల్లాల పరిధిలోని పాఠశాలల ఫీజులను నియంత్రిస్తాయి. ఒకవేళ డీఎఫ్‌ఆర్‌సీలు నిర్దేశించిన ఫీజుపై ఎవ‌రికైనా అభ్యంతరాలు ఉంటే రాష్ట్రస్థాయి కమిషన్‌కు దరఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

IIIT Campus Interviews : ట్రిపుల్ ఐటీలో క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలు.. ఎంపిక శాతం ఎంతంటే..

5 కేట‌గిరీలు.. ఫీజు చ‌ల్లింపులు..

- ప్రైవేటు పాఠశాలలను 5 కేటగిరీలుగా విభజించాలి. రాష్ట్రంలో సుమారు 11,500 ప్రైవేటు పాఠశాలలున్నాయి. పాఠశాలకున్న స్థలం, ప్రయోగశాలలు, కంప్యూటర్‌ ల్యాబ్, డైనింగ్‌ హాళ్లు, క్రీడా స్థలం, ఇతర సౌకర్యాల ఆధారంగా కేటగిరీలను నిర్ధారించాలి.

ఒక్కో విద్యార్థికి సగటున 25 చదరపు అడుగుల స్థలం కేటాయించాలి. 5వ కేటగిరీకి చెందిన పాఠశాలలు రూ.32 వేల వరకు ఫీజు వసూలు చేసుకోవచ్చు. ఆ పాఠశాలకు ఎకరా విస్తీర్ణం ఉండాలి. ఇక 2వ కేటగిరీ ఫీజు గరిష్ఠంగా రూ.2 లక్షలలోపు ఉండొచ్చు. 1వ‌కేటగిరీ స్కూల్‌కు గరిష్ఠ రుసుముకు సంబంధించిన నిర్ణ‌యం ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

Major Vacancies In AIIMS: దేశ వ్యాప్తంగా ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ, నాన్‌ ఫ్యాకల్టీ పోస్టులు

అధిక వ‌సూలుకు త‌ప్ప‌ని జ‌రిమానా..

విద్యార్థుల‌కు కేట‌గిరీలుగా విభ‌జించి ప్ర‌తీ ఒక్క కేట‌గిరీకి నిర్దేశించిన ఫీజు కంటే అధికంగా వసూలు చేస్తే.. ఆ అధికారుల‌కు, పాఠ‌శాల‌ల‌కు క‌ఠిన చ‌ర్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొద‌ట వారికి విచారణ జరిపిస్తారు. మొదటిసారి అయితే, రూ.లక్ష జరిమానా ఉండ‌గా, రెండోసారి రూ.2 లక్షలు, మూడోసారి రూ.5 లక్షల జరిమానా వసూలు చేస్తారు. ఒక‌వేళ, ఇలాగే ఆయా పాఠ‌శాల‌లు నిబంధనలను అతిక్రమిస్తూ ఉంటే, ఆ పాఠశాల అనుమతిని రద్దు చేస్తారు. పాఠశాలలు వసూలు చేస్తున్న ఫీజులను వాటికి సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను వెబ్‌సైట్‌లో స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. వాటి ఆడిట్‌ నివేదికలను కూడా పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణ‌యించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 06 Feb 2025 12:37PM

Photo Stories