Skip to main content

Breaking News: సుజనా చౌదరికి బిగ్ షాక్.. కాలేజీ గుర్తింపు రద్దు

ఎంపీ సుజనా చౌదరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. సుజనా చౌదరీకి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ రద్దు చేస్తూ మే 30న‌ నిర్ణయం తీసుకుంది.
BJP MP
సుజనా చౌదరికి బిగ్ షాక్.. కాలేజీ గుర్తింపు రద్దు

2023 – 24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్లు ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ శివార్లలోని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరిట సుజనా చౌదరీ ఈ కాలేజీని 2002లో ఏర్పాటు చేశారు.  ఈ కాలేజీ కింద ఏటా వంద మెడికల్‌ అడ్మిషన్లు యూనివర్సిటీ కౌన్సిలింగ్‌ ద్వారా కేటాయించేవారు. ఫిబ్రవరి 2017 నుంచి సీట్ల సంఖ్య 150కి పెరిగింది.

చదవండి:

కరీంనగర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలకు ‘ప్రైవేటు’ చెక్‌?

Transfers: వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు మార్గదర్శకాలు

Published date : 30 May 2023 05:51PM

Photo Stories