Skip to main content

CSR: విద్యా రంగానికి నిధులు

మెరుగైన నైపుణ్యాలతో కూడిన మానవవనరుల ద్వారానే సంస్థల పురోగతి సాధ్యమవుతుందని గట్టిగా నమ్ముతున్న పలు కంపెనీలు ఆ దిశగా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ–సీఎస్సార్) కింద నిధులను వినియోగించేందుకు మొగ్గుచూపుతున్నాయి.
CSR
విద్యా రంగానికి నిధులు

రానున్న కాలంలో విద్యా రంగానికి సీఎస్సార్ నిధులు కేటాయించేందుకు యోచిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల టీమ్లీజ్ నిర్వహించిన ప్రైవేటు ఎడ్టెక్ సర్వేలో పలు కంపెనీలు సీఎస్సార్ నిధుల వినియోగంపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. విద్యారంగానికి కేటాయింపుల ద్వారానే సంస్థల అభివృద్ధికి అవసరమైన మానవవనరులు అందుబాటులోకి వస్తాయని అభిప్రాయపడ్డాయి. పాఠశాలలు, కళాశాలల్లో డ్రాపవుట్ల నివారణకు 22.8 శాతం, ఉపాధి నైపుణ్యాల కల్పనకు 20.4 శాతం, దివ్యాంగుల కోసం 18 శాతం సీఎస్సార్ నిధులను వినియోగిస్తున్నట్లు పలు సంస్థలు వెల్లడించాయి. 2022–23లో విద్యా రంగానికి.. ముఖ్యంగా నైపుణ్యాల కల్పనకు సీఎస్సార్ నిధుల కేటాయింపును పెంచనున్నట్లు వివరించాయి. కాగా.. విద్యారంగానికి, నైపుణ్యాల కల్పనకు కంపెనీలు పెద్దపీట వేయడం వల్ల యువతకు ఎంతో మేలు కలుగుతుందని సర్వే పేర్కొంది. సర్వేలో 95.83 శాతం కంపెనీలు విద్య, వృత్తి నైపుణ్యం, జీవనోపాధి కల్పనలకు ఇప్పటివరకు నిధులను వినియోగిస్తున్నట్లు వెల్లడించాయి. ప్రజారోగ్యం, పేదరిక నిర్మూలన, పోషకాహార లోపం నివారణ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం మెరుగుదల అంశాలకు ఇప్పటివరకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చామని తెలిపాయి. వచ్చే ఏడాది నైపుణ్యాల కల్పనపై దృష్టి సారించేందుకు ఈ నిధులు ఇస్తామని ఎక్కువ శాతం కంపెనీలు సర్వేలో పేర్కొన్నాయి.

కంపెనీల నిర్ణయంతో విద్యార్థులకు మేలు..

కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలు మూతపడి విద్యార్థులకు నైపుణ్యాలు సరిగా సమకూరని నేపథ్యంలో ఆయా కంపెనీలు తాజాగా తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు ఎంతో ఉపకరించనుంది. అయితే సీఎస్సార్ నిధుల వినియోగంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్లు కొన్ని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. రవాణా, మౌలిక వసతులు వంటివి సమస్యగా ఉన్నట్లు అవి పేర్కొన్నాయి. సరైన అభ్యర్థులను గుర్తించడం, వారికి అవకాశాలు కలి్పంచడం ప్రస్తుతం తమకు ప్రధాన సమస్యగా ఉన్నట్లు ఎక్కువ శాతం కంపెనీలు పేర్కొన్నట్లు సర్వే తెలిపింది.

చదవండి: 

విద్యా రంగంపై ఓరియెంటేషన్.. జిల్లాల వారీగా తేదీలు ఇలా..

Schools: ఫిబ్రవరి 5 నుంచి స్కూళ్లు ప్రారంభం?

Bal Shakti Puraskar: ఇద్దరు తెలుగు బాలలకు ‘బాల పురస్కారాలు’

Published date : 26 Jan 2022 02:34PM

Photo Stories