YS Jagan Mohan Reddy: విద్య, వైద్యంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని 16 జిల్లాల్లో నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వి ద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సహా యం అందిస్తున్నారు.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అక్టోబర్ 18న పుంగనూరు ఏరియా ఆస్పత్రిని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీలు మిథున్‌రెడ్డి, రెడ్డెప్పతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లులా కార్యక్రమాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు.
30 ఏళ్లుగా పాలించిన ఒకే కుటుంబం పుంగనూరును అభివృద్ధి చేయలేదన్నారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పుంగనూరులో రెండు రిజర్వాయర్లు నిర్మించి, తాగు, సాగునీరు అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. దీన్ని ఓర్చుకోలేని చంద్రబాబు అండ్ కో తప్పుడు కేసులు వేసి, ప నులు అడ్డుకున్నారన్నారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయలేదన్నారు. చంద్రబాబు ప్రస్తుతం మేనిఫెస్టోలో ఇంటికి ఒక బంగారు ముద్ద ఇస్తామని చెప్పినా నమ్మేస్థితిలో లేరని ఎద్దేవా చేశారు.
చదవండి: ఇస్రో వర్క్‌షాప్‌లో కృష్ణా వర్సిటీ విద్యార్థులు
ఎక్కడివారికై నా ఇక్కడే వైద్యం
ఎక్కడివారికి ఏ జబ్బు చేసినా ఇక్కడికి వచ్చి వైద్యం చేసుకునేలా పుంగనూరు ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామని రాజంపేట ఎంపీ, లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి తెలిపారు. గతంలో వైద్యం కోసం బెంగళూరు, తిరుపతికి వెళ్లేవారని, ఇక మీదట పుంగనూరులోనే 100 పడకల ఆస్పత్రిలో అన్ని వైద్యసేవలు, సకల సదుపాయాలు కల్పించామన్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తా గునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
బోరునీటితో ఆరోగ్య సమస్యలు వస్తు న్న విషయం గుర్తించి, గండికోట రిజర్వాయర్ నుంచి వాటర్‌గ్రిడ్ ద్వారా సురక్షిత నీటి సరఫరా పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. అలాగే నియోజకవర్గంలో తాగు, సాగు నీరు అందించేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నేతిగుట్లపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ల పను లు త్వరలో పూర్తి చేస్తామన్నారు. పుంగనూరులో నిరుద్యోగులకు ఉపాధి సౌకర్యాలు కల్పించేందుకు ఆరడిగుంట వద్ద 1100 ఎకరాల్లో ప్రత్యేక ఎకనామిక్‌జోన్ ఏర్పాటు చేశామని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు.