Tenth Class Public Exams 2024: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా ప్రారంభం
చెన్నై: కట్టుదిట్టమైన ఆంక్షల నడుమ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మంగళవారం పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. తొలి రో జు ల్యాంగ్వెజ్ సబ్జెక్టు పరీక్ష జరిగింది. రాష్ట్రంలో మార్చి ఒకటో తేదీ నుంచి ప్లస్ ఒన్, ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ముగియగానే పది పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. పుదుచ్చేరితోపాటు రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 12 వేలకు పైగా ఉన్న పాఠశాలలకు చెందిన 9.10 లక్షల మంది విద్యార్థులు రాయాడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు. 4,107 కేంద్రాల్లో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.15 గంటలకు వరకు పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ల్యాంగ్వేజ్ సబ్జెక్టు పరీక్ష జరిగింది. బుధవారం విరామం తరువాత ఈ నెల 28వ తేదీన ఆంగ్లం పరీక్ష జరగనుంది. ఎన్నికల ప్రచారం హోరెత్తే వేళ పబ్లిక్ పరీక్షలు రావడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఆయా పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఎన్నికల ప్రచారాలకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయా పాఠశాలలే పరీక్షా కేంద్రాలు కావడంతో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయింది. పరీక్షా కేంద్రాల వద్ద, పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన తనిఖీలు, ఆంక్షల అనంతరం విద్యార్థులను ఉద యం 9.30 గంటలకు ఆయా కేంద్రాల్లోకి అనుమతించారు. ముందుగా ఆయా పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల్లో పరీక్ష భయాన్ని పొగొట్టేలా ప్రత్యేక కౌన్సెలింగ్, ప్రార్థన కార్యక్రమాలు జరిగాయి. తొలిరోజు ల్యాంగ్వేజ్ సబ్జెక్టు సులభంగానే ఉన్నట్టు విద్యార్థులు పేర్కొన్నారు.
తిరువళ్లూరులో ప్రశాంతంగా పరీక్షలు
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. పదో తరగతి పరీక్షలు మార్చి 26 నుంచి ఏప్రిల్ 10వ తేదీ వరకు జరనున్నాయి. ఈ పరీక్షలను 33,814 మంది విద్యార్థులు రాస్తున్నారు. వీరి కోసం 138 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిఘా నిమిత్తం 52 ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. తొలిరోజు ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరిగింది. కాగా ప్రశ్నపత్రాలను 13 కంట్రోల్ రూమ్‌ల నుంచి భారీ బందోబస్తు నడుమ 37 రూట్‌లలో తరలించారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత పరీక్ష హాలులోకి అనుమతించారు. బ్లూటూత్, సెల్‌ఫోన్, కాలిక్యులేటర్ తదితర వాటి ని నిషేధించారు. కాగా పరీక్ష కేంఽద్రానికి సమీపంలోని ఇంటర్‌నెట్, జెరాక్స్ సెంటర్‌లను సైతం మూసివేశారు. పరీక్ష కేంద్రం వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా తొలిరోజు 478 మంది పరీక్షలకు హాజరుకాలేదు. అలాగే జిల్లా వ్యాప్తంగా 540 మంది విద్యార్థులు తమ సహాయకుల సాయంతో పరీక్షలు రాశారు.
పకడ్బందీగా..
వేలూరు: తిరువణ్ణామలై, వేలూరు జిల్లాల్లో మంగళవారం మొదటి రోజు పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా జరిగాయి. వేలూరు విద్యా డివిజన్‌లో 103 పరీక్షా కేంద్రాల్లో 18,670 మంది విద్యార్థినీ విద్యార్థులు, తిరుపత్తూరు విద్యా డివిజన్‌లో 99 పరీక్షా కేంద్రాల్లో 16,550 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి మాస్ కాపీయింగ్ జరగకుండా పరీక్షలను పర్యవేక్షించేందుకు 1,625 మంది ప్రత్యేక సూపర్‌వైజర్లను నియమించారు. 107 మందికి పైగా స్పెషల్ స్క్వాడ్‌ను నియమించారు. వేలూరు అన్నా రోడ్డులోని ప్రభుత్వ ముస్లిం హైస్కూల్‌లో పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సుబ్బులక్ష్మి ఆకస్మికంగా తనఖీ చేశారు. అనంతరం విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులను సిద్ధంగా ఉంచాలని, ప్రతి గదిలోనే తాగునీటి వసతి కల్పించాలన్నారు. అలాగే తిరువణ్ణామలై జిల్లాలో మొత్తం 31,341 మంది పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించేందుకు 150 మంది స్పెషల్ సూపర్‌వైజర్లను నియమించారు.
Tags
- Tenth Class 2024 Exam Dates
- Tenth class public exams
- Guidelines of Tenth class
- sakshieducation latest news
- Tenth Class public exam schedule 2024
- Guidelines of class 10 exams
- Chennai Class 10 examinations
- Public exams in Tamil Nadu
- Puducherry school exams
- Students' test preparations
- Strict restrictions during exams