ప్రత్యేక అవసరాలున్న విద్యార్థుల బోధనలో మార్పులు
Sakshi Education
పదిమంది ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు పాఠశాలలో ఉంటే విధిగా ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
విద్యాహక్కు చట్టంలో భాగంగా గతంలో ప్రాథమిక పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకు ఒకరు, ఉన్నత పాఠశాలల్లో 15 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండేవారని పేర్కొంది. దీన్ని సవరిస్తూ ప్రాథమిక పాఠశాలల్లో పది మందికి ఒకరు, హైస్కూల్‌లో 15 మందికి ఒకరు ఉండాలని స్పష్టం చేసింది. మానసిక దివ్యాంగులకు విడిగా బోధించే బదులు, అందరితో కలిపి విద్యను అందించడం వల్ల వారిలో మానసికమైన మార్పులు వస్తాయని గుర్తించారు. ఇందులో భాగంగా ప్రతి పాఠశాలలో వీరికి బోధించేలా కొంతమంది టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
చదవండి:
కారణాలేంటో తెలియజేయండి.. ఈ మార్కుల తగ్గింపుపై ఎన్‌టీఏకు హైకోర్టు ఆదేశం
Published date : 08 Oct 2022 02:09PM