Skip to main content

Prof KC Reddy: ‘విద్యా విధానంలో మార్పులు గమనించాలి’

ఎచ్చెర్ల క్యాంపస్‌: ప్రస్తుత విద్యా విధానం అమలులో అనేక మార్పులు వస్తున్నాయని, ఈ మార్పులు గమనించి విద్యార్థులను ఉత్తమ మానవ వనరులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ట్రిపుల్‌ ఐటీ) చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి అన్నారు.
Changes in the education system should be observed
‘విద్యా విధానంలో మార్పులు గమనించాలి’

 శ్రీకాకుళం ట్రిపుట్‌ ఐటీ ఎస్‌ఎం పురం క్యాంపస్‌లో సెప్టెంబ‌ర్ 24న‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ఓరియంటేషన్‌ ప్రొగ్రాం నిర్వహించా రు. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. నూతన విద్యా విధానం అమలు తర్వాత ఇంజినీరింగ్‌ విద్యలో అనేక మార్పులు వచ్చాయని అన్నారు. థియరీ, ప్రాక్టికల్స్‌, ఇంటర్న్‌షిప్‌లు పక్కాగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు రిలీవ్‌ నాటికి మంచి ప్యాకేజీలతో ఉద్యోగం సాధిస్తున్నారని అన్నారు. మరో పక్క ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం సత్తా చాటుతున్నారని పేర్కొన్నారు.

చదవండి: Devireddy Sudheer Reddy: ఉపాధ్యాయుల పాత్ర గొప్పది

ట్రిపుల్‌ ఐటీ గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్త మ మార్కులు సాధించిన ప్రతిభ గల విద్యా ర్థులు చేరుతున్నారని అన్నారు. వారిలో నైపుణ్యాలు వెలికి తీసి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధిస్తారని అన్నారు. అనంతరం వర్సిటీలో నిర్మాణాలు, అకడమిక్‌ వ్యవహారా లు, వసతి గృహం నిర్వహణ వంటివాటిపై సమీక్షించారు. కార్యక్రమంలో డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు, పరిపాలనాధికారి ముని రామకృష్ణ, అకడమిక్‌ డీన్‌ మోహన కృష్ణ, రిసోర్సు పర్సన్లు ప్రొఫెసర్‌ డి. హరినారాయణ, ప్రొఫెసర్‌ భాస్కర్‌రెడ్డి, ప్రొఫెసర్‌ రామకృష్ణారావు పాల్గొన్నారు.

చదవండి: Job Fair: 27న జాబ్‌ మేళా

Published date : 25 Sep 2023 04:17PM

Photo Stories