Medical and Health Department: పేద విద్యార్థులకు చేరువగా వైద్య విద్య
ఇందుకోసం దాదాపు రూ.8,500 కోట్లు వెచ్చించి.. త్వరలోనే 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చేందుకు విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువచేయాలన్న సంకల్పంతో మెడికల్ కళాశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మొదటి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఐదు మెడికల్ కళాశాలల్లో సెప్టెంబర్ నుంచి తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది మరో ఐదు మెడికల్ కళాశాలల్లోనూ, ఆపై ఏడాది మిగిలిన ఏడు మెడికల్ కళాశాలల్లోనూ అకడమిక్ ఇయర్‌ను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
చదవండి: Dr Mansukh Mandaviya: 2014 నుంచి 110% పెరిగిన సీట్లు
14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదని దుయ్యబట్టారు. కనీసం ఆస్పత్రులనైనా అభివృద్ధి చేశారా అంటే అదీ శూన్యమన్నారు. ఆస్పత్రుల్లో మందులనైనా ప్రజలకు అందుబాటులోకి తెద్దామన్న ఆలోచన కూడా చేయని చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వైద్య రంగానికి సంబంధించి దాదాపు 50,000 ఉద్యోగాలిచి్చన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. మరో 3,000 పోస్టులకు మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నోటిఫికేషన్ జారీ చేసినట్టు చెప్పారు.
రైతులపై చంద్రబాబుది మొసలికన్నీరేనని ధ్వజమెత్తారు. రైతును రారాజుగా చూస్తోంది, వారికి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ ప్రభుత్వమేనన్న విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, వైఎసార్‌సీపీ యువజన విభాగం జోనల్ ఇన్‌చార్జ్ పేర్ని కిట్టు పాల్గొన్నారు.