Skip to main content

భాషా నైపుణ్యంతో అదరగొడుతున్న జెడ్పీ విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పద సంపదను పెంపొందించడం ద్వారా వారిలో భాషా నైపుణ్యాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దవచ్చనే సంకల్పం ఫలితమిస్తోంది.
Bendapudi  ZP school students English language skills
ప్రభుత్వం ఇచ్చిన ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలతో బెండపూడి విద్యార్థినులు

ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘లిప్‌’ (లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌)కు అనూహ్య స్పందన కనిపిస్తోంది. 1, 2 తరగతుల విద్యార్థులు రోజూ రెండు పదాలు, 3 నుంచి 5వ తరగతి వరకు మూడు పదాలు (ఇంగ్లిష్, తెలుగులో), 6 నుంచి 10వ తరగతి వరకు 5 పదాలు (ఇంగ్లిష్, తెలుగు, హిందీలో) నేర్పుతున్నారు. జగనన్న విద్యా కానుక కింద విద్యార్థులకు ఉచితంగా అందజేసిన బైలింగ్వల్‌ బుక్స్, డిక్షనరీల వల్ల పిల్లల్లో ఇంగ్లిష్‌పై పట్టు పెరుగుతోంది. వెరసి.. ఈ మూడు జిల్లాల్లో 11,20,862 మంది విద్యార్థుల్లో భాషా నైపుణ్యం దినదినాభివృద్ధి చెందుతోంది.
అది కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఒక మేజర్‌ గ్రామ పంచాయతీ. పది వేల జనాభాతో నాలుగైదు శివారు పల్లెలు కలిగిన ఆ పంచాయతీలో వ్యవసాయం, కూలి నాలీ, చిన్నా, చితకా వ్యాపారాలతో పొట్టపోసుకునే వారే ఎక్కువ. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ గ్రామ పంచాయతీ పేరు బెండపూడి. ఇక్కడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు చూపుతున్న భాషా నైపుణ్యం వల్ల ఇప్పుడు ఈ గ్రామం పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగిపోతోంది. వ్యవసాయం తప్ప అక్షరం ముక్క తెలియని కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు అమెరికా సంయుక్త రాష్ట్రాల విద్యార్థులతో ఆన్ లైన్ లో ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. 

ఇది ఎలా సాధ్యమైందంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా డ్రైవ్‌ నిర్వహిస్తోంది. లెరి్నంగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం (లిప్‌) అనే 100 రోజుల వినూత్న కార్యక్రమాన్ని విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టింది. ఐదు నుంచి పదో తరగతి వరకు విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, హిందీ... ఈ మూడు భాషలపై పట్టు సా«ధించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ ‘లిప్‌’ కార్యక్రమానికి బెండపూడిలో ఉపాధ్యాయుడు జీవీఎస్‌ ప్రసాద్‌ వినూత్న ఆలోచనలు కూడా జోడించి అమెరికా సంయుక్త రాష్ట్రాల విద్యార్థులతో డిబేట్‌లలో పాల్గొనేలా విద్యార్థులను తీర్చి దిద్దారు. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపైంది. ‘హలో వుయ్‌ స్పీక్‌ ఇంగ్లిష్‌ వెరీ వెల్‌ విత్‌ ఎవ్రీవన్’ అంటూ అనర్గళంగా మాట్లాడుతున్న ఈ పాఠశాల విద్యార్థులను చూసి కార్పొరేట్‌ పాఠశాలలు విస్తుపోవాల్సిందే. ఈ విద్యార్థులు ఆంగ్లబాషను అమెరికాలో వాడుక భాష స్టైల్‌లో చాలా సాదాసీదాగా మాట్లాడేస్తున్నారు. కార్పొరేట్‌ పాఠశాలల విద్యార్థులను తలదన్నే రీతిలో అమెరికన్ విద్యార్థులతో వారాంతాల్లో డిబేట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు.

Sakshi Education Mobile App

రోజూ ఐదు పదాలు..

ూ బెండపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో 483 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం గతేడాది నవంబరు 10న ప్రారంభించి, మార్చి 31 వరకు నిర్వహించారు. తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు రోజుకు ఐదు ఇంగ్లిష్‌ పదాల చొప్పున నేరి్పంచారు. ఆ పదాలకు తెలుగు, హిందీ ఆర్థాలు నేర్పారు. ఇలా వంద రోజుల్లో 1,500 పదాలు నేర్చుకునే విధంగా ఒక ఫార్మాట్‌ రూపొందించి అమలు చేశారు. 
ూ ‘లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే’ అనే మరో 100 రోజుల కార్యక్రమంలో ఇంగ్లిష్‌ పదాలు నేర్చుకుంటున్నారు. ప్రతి రోజు ఉదయం స్కూల్‌ అసెంబ్లీలో తొలి 10, 15 నిమిషాలు ఈ పదాలపై ఉపాధ్యాయులు తర్ఫీదు ఇస్తున్నారు. తర్వాత తరగతి గదిలో వాటిని బోర్డుపై రాయించి, ఎలా పలకాలో వివరిస్తున్నారు.
ూ ప్రతి 15 రోజులకు ఒకసారి పరీక్ష పెట్టే వారు. ఇంగ్లిష్, తెలుగు, హిందీ భాషలకు 10 మార్కుల చొప్పున మొత్తం 30 మార్కులకు ఆ పరీక్ష ఉండేది. తద్వారా ఆంగ్లంపై ఎంత వరకు పట్టు సాధించారనేది మదింపు చేసుకుంటూ చివరలో గ్రాండ్‌ టెస్ట్‌ నిర్వహించారు. ఈ టెస్టులో బెండపూడి విద్యార్థులు 60–84 శాతం మార్కులు సాధించి రాష్ట్రంలో బి కేటగిరీలో ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ను సొంతం చేసుకున్నారు.

ఆమెరికన్ విద్యార్థులతో ఆన్ లైన్ డిబేట్లు 

ూ ఆంగ్ల భాషపై బాగా ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుని, వారు అమెరికన్ ఫొనెటిక్‌ (ఉచ్ఛారణ) సౌండ్స్‌పై దృష్టి సారించేలా చూశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ‘నేటివ్‌ స్పీకర్స్‌ క్లబ్‌’ను ఏర్పాటు చేశారు. ఇందుకు పెనుగొండ లోవరాజు చారిటబుల్‌ ట్రస్ట్, పెనుగొండ చిట్టబ్బాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ల తోడ్పాటు తీసుకున్నారు. 
ూ అమెరికా సంయుక్త రాష్ట్రాలైన అట్లాంటా, జార్జియాల్లోని వివిధ పాఠశాల విద్యార్థులు, వారి స్నేహితులతో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు ఆన్ లైన్ లో బెండపూడి విద్యార్థులు పలు అంశాలపై డిబేట్లు నిర్వహిస్తున్నారు.
ూ ఈ పాఠశాలలో ప్రస్తుతం 50 శాతం మంది విద్యార్ధులు అమెరికన్ స్లాంగ్‌లో అద్భుతంగా మాట్లాడుతున్నారు. తమ పిల్లలు అనర్గళంగా మాట్లాడుతుండటం చూసి తల్లిదండ్రులు మురిసి పోతున్నారు. ఉపాధ్యాయులు జీవీ ప్రసాద్, సీహెచ్‌వీ సుబ్బారావు, ఎం.శ్రీదేవి సమన్వయంతో పని చేయడం వల్ల ఈ విజయం తమ పాఠశాల సొంతమైందని ప్రధానోపాధ్యాయుడు జి.రామకృష్ణారావు సంతోషం వ్యక్తం చేశారు.

ఇప్పుడు మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది

మా స్కూల్లో ఇంగ్లిష్‌ భాష నేర్చుకోవడంపై ప్రత్యేకంగా ఎల్‌ఐపీ ప్రోగ్రాం నిర్వహించారు. కొత్త ఇంగ్లిష్‌ పదాలు నేర్చుకోవడం దినచర్యగా మారింది. దీంతో వాడుక భాషలో ఇంగ్లిష్‌ పదాలపై పట్టు సాధించా. మా ఇంగ్లిష్‌ టీచర్‌ జీవీ ప్రసాద్‌ సహకారంతో ఆన్ లైన్లో అమెరికాలోని విద్యార్థులతో డిబేట్‌లో పాల్గొంటున్నాము. ఇప్పుడు ఏ స్థాయిలో వారితోనైనా ఇంగ్లిష్ లో చక్కగా మాట్లాడగలుగుతాననే ఆత్మవిశ్వాసం పెరిగింది.
– ఆర్‌.తేజస్విని, ఎనిమిదో తరగతి, జెడ్పీ హైసూ్కల్, బెండపూడి

ప్రతి రోజు ఇంగ్లిష్‌పై ప్రత్యేక శ్రద్ధ

మా పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్, హిందీ పదాలు రోజుకు ఐదు చొప్పున ప్రతి రోజూ ఉదయం అసెంబ్లీలో టీచర్లు చెప్పించారు. తరగతి గదిలో వాటిని మరోసారి మాతో ప్రాక్టీస్‌ చేయిస్తున్నారు. లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం మాకు బాగా ఉపకరించింది. తొలుత స్నేహితులతో ఇంగ్లిష్ లో మాట్లాడటం అలవాటు చేసుకున్నాం. ఇప్పుడు ఎవరితోనైనా చక్కగా మాట్లాడుతున్నాం. 
– కె.రీష్మ, పి.అనూష, పదవ తరగతి, జెడ్పీ హైసూ్కల్, బెండపూడి

విజన్ ఉన్న ప్రభుత్వం

ప్రభుత్వం పాఠశాలల బాగు కోసం ఎంతో చేస్తోంది. పిల్లలకు మంచి భవిష్యత్‌ కోసం ముందు చూపుతో వ్యవహరిస్తోంది. మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించింది. ఆంగ్ల భాష అభ్యసించడం ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్‌ లభిస్తుంది. అందుకే ప్రత్యేక శ్రద్ధ పెట్టి అమెరికన్ స్లాంగ్‌ను మా విద్యార్థులకు నేరి్పంచాం. తొలుత ఎంపిక చేసిన విద్యార్థులతో ‘నేటివ్‌ స్పీకర్స్‌ క్లబ్‌’ ఏర్పాటు చేసి ఈ ప్రగతి సాధించాం.
– జీవీ ప్రసాద్, ఇంగ్లిష్‌ అధ్యాపకుడు, బెండపూడి

Published date : 24 Apr 2022 12:33PM

Photo Stories