Skip to main content

Degree College: బాన్సువాడ డిగ్రీ కళాశాలకు స్వయంప్రతిపత్తి

బాన్సువాడ రూరల్‌: మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలకు స్వయంప్రతిపత్తి హోదా లభించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఇందూరి గంగాధర్‌ తెలిపారు.
Empowering Education: Autonomous Status for Bansuwada Rural College, Milestone Achievement: Autonomous Sriram Narayana Khedia Govt. Degree College, College Principal Induri Gangadhar Announces Autonomous Status, Autonomous Status Granted to College in Bansuwada Rural, Autonomous to Bansuwada Degree College, Bansuwada Rural: Sriram Narayana Khedia Govt. Degree College,

కళాశాలకు అటానమస్‌ హోదా లభించడంతో ప్రిన్సిపల్‌, అధ్యాపకులు, సిబ్బంది టపాసులు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కళాశాలకు ఇటీవల మంజూరైన ఎన్‌సీసీ యూనిట్‌ను ప్రారంభించి స్వీట్లు పంచారు.

చదవండి: TSCHE: హాజరుకూ మార్కులు!.. వచ్చే ఏడాది నుంచి అమలు

ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ మాట్లాడుతూ స్వయంప్రతిపత్తితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, యూజీసీ మరిన్ని నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సొంతంగా సిలబస్‌ రూపొందించుకోవడంతో పాటు నాణ్యమైన విద్యను అందించవచ్చన్నారు.

కళాశాలకు అటానమస్‌ గుర్తింపు లభించడంతో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ గులాం ముస్తఫా, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Published date : 23 Nov 2023 10:02AM

Photo Stories