School Education Department: ఏపీ విద్యా సంస్కరణలకు ప్రపంచ దేశాల ప్రశంస
నెదర్లాండ్స్‌లోని యుట్రెచ్ట్‌లో జరుగుతున్న ‘Global Social and Financial Skills Conference–2023’లో భారత ప్రతినిధిగా ఆయన పాల్గొన్నారు. నవంబర్ 2న జరిగిన ప్యానెల్ చర్చలో ఈజిప్ట్, బుర్కినఫాసో, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్‌తోపాటు భారత్ తరఫున పాల్గొన్న సురేష్‌కుమార్ విద్యాభివృద్ధికి మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ఆవిష్కరణలు, సాధించిన ఫలితాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు.
చదవండి: School Education Department: ప్రైవేటు పాఠశాలలకు అనుమతి ఇలా కుడా
విద్యారంగంలో ‘ఆంధ్రప్రదేశ్ ఎలా విజయం సాధించగలిగింది’ అని ప్రతిని«దులు అడిగిన ప్రశ్నకు.. బదులిస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అద్భుతమైన ఎస్సీఈఆర్టీ, జిల్లా విద్యా శాఖాధికారులు, డీఎస్‌వోలతో పాటు భాగస్వామ్య సంస్థలైన అఫ్లాటౌన్ ఇంటర్నేషనల్, ఉద్యమ్ లెర్నింగ్ ఫౌండేషన్, రీప్ బెనిఫిట్ సహకారంతో సాధ్యమైంద’ని చెప్పారు. అనంతరం సురేష్‌కుమార్ యునిసెఫ్, ది గ్లోబల్ ఫైనాన్షియల్ లిట్రసీ ఎక్సలెన్స్ సెంటర్ చర్చల్లో పాల్గొన్నారు.