Skip to main content

Library and Information Science: సర్టీఫికెట్ కోర్సుకు దరఖాస్తులు

రాష్ట్ర పౌర గ్రంథాలయాల శాఖ ఆధ్వర్యంలో 5 నెలల కాల పరిమితితో Library and Information Science సర్టీఫికెట్‌ కోర్సును అందిస్తున్నట్టు గ్రంథాలయ శాఖ డైరెక్టర్‌ ఎంఆర్‌ ప్రసన్నకుమార్‌ అక్టోబర్‌ 12న ఓ ప్రకటనలో తెలిపారు.
Library and Information Science
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సర్టీఫికెట్ కోర్సుకు దరఖాస్తులు

రాష్ట్రంలో గుర్తింపు పొందిన పీఎన్‌ స్కూల్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌(విజయవాడ), రాయలసీమ ఇనిస్టిట్యూట్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌(గాందీనగర్, కడప), వావిలాల సంస్థ లైబ్రరీ సైన్స్‌(అరండల్‌ పేట, గుంటూరు)లలో ఒక్కో సంస్థలో తెలుగు మాధ్యమంలో 40, ఆంగ్ల మాధ్యమంలో 40 సీట్ల చొప్పున మొత్తం 240 సీట్లు ఉన్నట్టు చెప్పారు.

చదవండి: Books: పుస్తకాలతో దోస్తీ.. – careof అఫ్జల్‌గంజ్‌

డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30 వరకు సర్టీఫికెట్‌ కోర్సు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇంటర్‌(జనరల్‌) లేదా యూజీసీ గుర్తింపు కలిగిన ఏదైనా విద్యా సంస్థలో తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితాను రూపొందిస్తామన్నారు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైతే ఎంపికలో వెయిటేజీ ఉంటుందని తెలిపారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులు నవంబర్‌ ఒకటో తేదీ నుంచి 15 వరకు ఆయా సంస్థల ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో దరఖాస్తులు పొందొచ్చని, నవంబరు 18లోగా వాటిని ప్రిన్సిపాళ్లకు పంపించాలని సూచించారు. 

చదవండి: Competitive Exams: పోటీ పరీక్షలకు సమస్యల సమరం

Published date : 13 Oct 2022 05:23PM

Photo Stories