Skip to main content

Andhra Pradesh : ఇక నుంచి ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానం.. ఉత్తర్వులు జారీ

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానం తెస్తూ ప్రభుత్వం డిసెంబ‌ర్ 17వ తేదీన (శనివారం) ఉత్తర్వులు జారీ చేసింది.
ap schools
AP Schools Semester System

2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్‌లు, పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్‌లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. త్వరలోనే ఈ సెమిస్టర్ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | మోడల్ పేపర్స్ 2022 | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా..

ap school students

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రాధమిక విద్యలో సెమిస్టర్‌ విద్యా విధానం అమలులోకి తెస్తోంది. పాఠ్యపుస్తకాలను కూడా సెమిస్టర్ల వారీగానే విద్యార్థులకు అందజేస్తారు. ఇలా చేయడం ద్వారా పుస్తకాల బరువు భారం చాలావరకు తగ్గుతుంది అంటున్నారు. అంతేకాదు ఏడాది మొత్తానికి ఒకే ఒక పాఠ్య పుస్తకాన్ని ఇవ్వడంతో పరిమాణం పెరిగింది. విద్యార్ధులు కూడా అధిక బరువులు మోయలేక ఇబ్బందిపడేవారు. సెమిస్టర్ల వారీగా పుస్తకాలను అందించడం వల్ల మోత బరువు నుంచి విముక్తి దొరుకుతుంది అంటున్నారు. అంతేకాదు రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ సంస్థ పలువురు విద్యారంగ నిపుణులతో చర్చించి 1 నుంచి 6వ తరగతి వరకు పాఠ్యాంశాల్లో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు తొలిసారిగా 1వ తరగతి నుంచి పిల్లలకు వర్క్‌ బుక్స్‌ను ప్రవేశపెట్టడంతోపాటు టీచర్స్‌ హ్యాండ్‌బుక్‌ కూడా ఇస్తున్నారు. ఇలా విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.

చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - సిలబస్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను..

ప్రభుత్వ స్కూళ్లలో పాఠ్యాంశాల బోధనలో మరో కొత్త శకం ఆరంభం కానుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేలా ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ ముందడుగు వేస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో కూడిన డిజిటల్‌ పాఠ్యాంశాలను అందించడానికి వీలుగా ఉచితంగా ట్యాబ్‌లను పంపిణీ చేయనుంది. ప్రపంచ ప్రఖ్యాత ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు చెందిన ఈ–పాఠ్యాంశాలతో కూడిన ట్యాబ్‌లను రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలోని 8వ తరగతి చదువుతున్న పిల్లలందరికీ అందించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్‌ 21న ఆయన చేతుల మీదుగా ఈ ట్యాబ్‌లను అందించనున్నారు. 

Published date : 17 Dec 2022 12:53PM

Photo Stories