Open School: అడ్మిషన్లు ప్రక్రియ ప్రారంభ తేదీ ఇదే.. ‘జ్ఞానధార’ యూట్యూబ్ చానల్ ప్రారంభం
అక్టోబర్ 5 వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మార్కుల మెమో, పాస్ సర్టిఫికెట్లు నేరుగా వారి చిరునామాకే పంపుతామని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ ప్రక్రియ, అధ్యయన కేంద్రాలకు ఉండాల్సిన అర్హతలువంటి అంశాలపై అన్ని జిల్లాల సమన్వయకర్తలు, అసిస్టెంట్ కమిషనర్లకు దిశానిర్దేశం చేసినట్లు వివరించారు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
‘జ్ఞానధార’యూట్యూబ్ చానల్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ‘ఏపీఓఎస్‌ఎస్– జ్ఞానధార’ ప్రత్యేక యూట్యూబ్ చానల్‌ను జూలై 20న ప్రారంభించారు. ఇందులో పది, ఇంటర్ విద్యార్థులకు వీడియో పాఠ్యాంశాలు అందుబాటులో ఉంచుతామని శ్రీనివాసులురెడ్డి తెలిపారు.