Skip to main content

AP Fisheries University: ఏపీ మత్స్య వర్సిటీ ఏర్పాటు

AP Fisheries University Notification
AP Fisheries University Notification
  • 2023–24 విద్యా సంవత్సరం నుంచి తరగతులు

సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన మార్గదర్శకాలతో ఫిబ్రవరి 10న ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. 2023–24 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయని మత్స్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య జారీచేసిన ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాలకమండలి, వైస్‌ చాన్సలర్, ఇతర అధికారుల నియామకానికి, అకడమిక్, రీసెర్చ్‌ కౌన్సిల్, ప్లానింగ్, ఫ్యాకల్టీ బోర్డుల ఏర్పాటుకు మార్గదర్శకాలు, వారి విధులు, బాధ్యతలను వివరించారు. రూ.352 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.100 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో అకడమిక్‌ బ్లాక్, పరిపాలన భవనం, బాలుర, బాలికల హాస్టళ్లు, రైతు శిక్షణ కేంద్రం, వైస్‌ చాన్సలర్‌ బంగ్లా నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. 
 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 11 Feb 2022 04:05PM

Photo Stories