Skip to main content

HCU: పీహెచ్‌డీ ప్రవేశాలకు ప్రకటన

రాయదుర్గం: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ 2023–24 విద్యా సంవత్సరానికిగాను పీహెచ్‌డీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
HCU
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ పీహెచ్‌డీ ప్రవేశాలకు ప్రకటన

ఆలిండియా ప్రవేశ పరీక్ష (నెట్‌/జేఆర్‌ఎఫ్‌) ఉత్తీర్ణులైన అభ్యర్థులు పీహెచ్‌డీకి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. మే 1 నుంచి మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. జూన్‌ 10 నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జూన్‌ 17, 18 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పీహెచ్‌డీ కోర్సులు, అర్హత ప్రమాణాలు, నిర్ణీత రుసుము, రిజర్వేషన్‌ విధానం, ప్రాస్పెక్టస్‌ 2023–24తో సహా మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని అధికారులు సూచించారు.

చదవండి:

ద్రవిడ వర్సిటీలో రిటైర్డ్‌ జడ్జితో విచారణ

Admission: అంబేడ్కర్‌ వర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశానికి నోటిఫికేషన్‌

Published date : 29 Apr 2023 04:02PM

Photo Stories