High Court: ‘ఎంబీబీఎస్ విద్యార్థినిని పరీక్షలకు అనుమతించండి’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థినిని పరీక్షలు రాసేందుకు అనుమతించాలని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది.
‘ఎంబీబీఎస్ విద్యార్థినిని పరీక్షలకు అనుమతించండి’
హాజరు శాతం లేదంటూ నార్కట్‌పల్లిలోని కామినేనిలో చదువుతున్న విద్యార్థిని జొన్నలగడ్డ అరుణను కాలేజీ, వర్సిటీ పరీక్షలు రాసేందుకు అనుమతించలేదు. దీన్ని తొలుత విద్యారి్థని హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద సవాల్ చేయగా, పిటిషన్‌ను కొట్టివేశారు. దీనిపై సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించగా, వాదనలు విని నేటి నుంచి జరిగే ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు.